
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జనవరి 15న అర్ధరాత్రి దాడి జరిగింది. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇంట్లోకి అడుగు పెట్టిన దుండగుడు కత్తితో సైఫ్ ను పదేపదే పొడిచాడు. దీంతో నటుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత ఇంటి కేర్ టేకర్ సహాయంతో సైఫ్ ఆటో రిక్షా ఎక్కి వెంటనే లీలావతి హాస్పిటల్ కు చేరుకున్నాడు. అక్కడ అతనికి ఆపరేషన్ చేసి, శరీరంలో కత్తి మొన భాగాన్ని తొలగించారు. పరిస్థితి కుదట పడడంతో రెండు రోజుల క్రితం (మంగళవారం జనవరి 21) సైఫ్ ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ వెంటనే నటుడు ఆసుపత్రికి తరలించడానికి సహాయం చేసిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణాను కలుసుకున్నాడు. చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపాడు. సైఫ్ కుటుంబీకులతో పాటు అతని తల్లి షర్మిలా ఠాగూర్ కూడా చేతులు కలిపి భజన్ సింగ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని నివేదికల ప్రకారం, సైఫ్ అలీ ఖాన్ ఆటో రిక్షా డ్రైవర్‌కు రూ.50 వేలు ఇచ్చాడని టాక్. అయితే దీనిపై సైఫ్ కానీ భజన్ సింగ్ కానీ ఎవరూ అధికారికంగా వ్యాఖ్యానించలేదు. ఇక గాయకుడు మికా సింగ్ కూడా ఆ ఆటో డ్రైవర్‌కు లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. అయితే ఆటోడ్రైవర్ భజన్ సింగ్ రాణా తనకు డబ్బు పై ఆశ కానీ మోజు కానీ లేదంటున్నాడు.
‘నేను ఆసుపత్రిలో సైఫ్‌ను కలిశాను. అతని ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను. ప్రస్తుతం నటుడి పరిస్థితి మెరుగుపడింది. ఆస్పత్రి నుంచి వచ్చిన వెంటనే సైఫ్ నాకు ధన్యవాదాలు తెలిపాడు. సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ ఆసుపత్రిలో ఉన్నారని, సారా అలీ ఖాన్ కూడా ఉన్నారని, అందరూ నాకు కృతజ్ఞతలు తెలిపారని భజన్ సింగ్ రానా అన్నారు. అలాంటి గొప్ప ఆర్టిస్టులను కలవడం నాకు కూడా బాగానే అనిపించింది. మీకు ఎప్పుడైనా ఏదైనా కావాలంటే చెప్పండి, సైఫ్ సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు.’ అని భజన్ సింగ్ చెప్పుకొచ్చారు. ఇఇదే సమయంలో తన మనసులోని కోరికను బయట పెట్టాడు. ‘సైఫ్ నుంచి నాకు ఏమీ వద్దు. నేనేమీ అడగడం లేదు కూడా. ఆ రోజు నేను చేసిన పనికి ప్రతిఫలంగా ఏదైనా పొందాలనే తాపత్రయం లేదా దురాశ నాకు లేదు, అతను వివరించాడు. అయితే ఆయన నాకు ఒక ఆటో రిక్షా ఇవ్వాలనుకుంటే, ఆనందంగా తీసుకుంటాను’ అని చెప్పుకొచ్చాడు ఆటో డ్రైవర్.
నిజానికి ఆటో డ్రైవర్ భజన్ సింగ్ ముంబైలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అంతే కాకుండా అతను నడుపుతున్న రిక్షా తనది కాదు. దీనికి భజన్ సింగ్ అద్దె కూడా చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, భజన్ సింగ్‌కు ఆటో రిక్షాను బహుమతిగా ఇవ్వాలని సైఫ్ అలీ ఖాన్‌కు ఒక సామాజిక కార్యకర్త విజ్ఞప్తి చేశాడు. భజన్ సింగ్ కూడా సైఫ్ ను ఒక ఆటోరిక్షాను కోరినట్లు తెలుస్తోంది. అలాగే సినిమాల్లో కనిపించాలనే ఆశ తనకూ ఉందని, కుదిరితే ఏదైనా ఒక సినిమాలో చిన్నా పాత్ర ఇస్తే ఆనందంగా నటిస్తానని రానా చెప్పినట్లు సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.