Saif Ali Khan: నా పేరును నాశనం చేశారు.. నేను కోర్టుకు వెళ్తాను.. సైఫ్ దాడిలో అనుమానుతుడి ఆవేదన..

ముంబై పోలీసుల అత్యుత్సాహం వల్ల ఓ అమాయకుడి జీవితం బలైంది. సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో అనుమానితుడిగా పట్టుబడిన ఆకాష్ కనోజియా తన జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు, తన కుటుంబానికి వచ్చిన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. అంతేకాదు తనను ఎలా అరెస్ట్ చేశారు అనే విషయాన్ని కూడా వివరించాడు.

Saif Ali Khan: నా పేరును నాశనం చేశారు.. నేను కోర్టుకు వెళ్తాను.. సైఫ్ దాడిలో అనుమానుతుడి ఆవేదన..
Saif Alikhan Stabbing Case

Updated on: Jan 30, 2025 | 6:19 PM

సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో రోజుకో కొత్త అప్‌డేట్‌లు వస్తున్నాయి. అరెస్టయిన దుండగుడితో పాటు కేసును క్షుణ్ణంగా విచారిస్తున్నారు. అయితే తరచుగా చర్చించబడే మరో పేరు ఆకాష్ కనోజియా, సైఫ్ దాడి కేసులో అనుమానితుడిగా అరెస్టు చేసినందుకు అతడి జీవితం పూర్తిగా మారిపోయింది. సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసినందుకు ఆకాష్ కనోజియాను పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీటీవీలో కనిపించిన దుండగుడి ముఖం ఆకాశ్‌ ముఖంలా ఉండడంతో ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు నేరుగా ఆకాష్‌ను దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అసలు నిందితుడిని గుర్తించిన మూడు రోజుల తర్వాత ఆకాష్‌ని విడుదల చేశారు.

అయితే తనను అరెస్ట్ చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఆకాష్. ఈ కేసులో తన పేరు పొరపాటుగా రావడంతో ఉద్యోగం పోయింది.. వివాహం ఆగిపోయింది. పోలీసుల పొరపాటు అతనితో పాటు అతని కుటుంబంపైనా తీవ్ర ప్రభావం చూపింది. ఇటీవల ఆకాష్ టీవీ9తో మాట్లాడుతూ.. “నేను ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ స్టేషన్‌లో రైలులో కూర్చున్నప్పుడు, రైల్వే పోలీసులు మా వద్దకు వచ్చి నా ఫోటోను చూపించారు, ఆ తర్వాత పోలీసులు నన్ను రైలు నుండి దిగమని అడిగారు. న‌న్ను ఎందుకు దించుతున్నార‌ని నేను ప్ర‌శ్నించ‌గా.. ట్రైన్‌లో నుంచి దిగు అని ముంబై పోలీసులు అడిగార‌ని పోలీసులు చెప్పారు. ముంబై పోలీసులు నా వద్దకు వచ్చినప్పుడు, ఫోటోలో ఉన్న వ్యక్తి మీరేనని అంగీకరించండి. దీంతో పోలీసులు ఆకాష్‌ను దాడికి పాల్పడింది తానేనని ఒప్పుకోవాలని కోరారు. ఫోటోలో ఉన్నది నేను కాకపోతే, నేను ఎందుకు అంగీకరించాలి అని ముంబై పోలీసులకు చెప్పాను. మీరు నన్ను సైఫ్ అలీఖాన్ వద్దకు తీసుకువెళ్లాలని నేను ముంబై పోలీసులను అభ్యర్థించాను, ఒకవేళ సైఫ్ అలీఖాన్ నేనే దాడి చేసిన వ్యక్తిని అని చెబితే, మీరు నన్ను అరెస్టు చేయండి. పోలీసులు నన్ను ఉదయం 10:30 గంటలకు పట్టుకున్నారు, ముంబై పోలీసులు రాత్రి 9:30 గంటలకు వచ్చి నన్ను రాత్రంతా అక్కడే ఉంచి విచారణ చేశారు, మధ్యాహ్నం 12:30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విడుదల చేశారు. పొరపాటున నిన్ను పట్టుకుంటే వెళ్లిపోవచ్చు అని పోలీసులు చెప్పారు’ అని అన్నాడు.

‘నాపట్ల చాలా తప్పు జరిగింది. ఇలా ఎవరికీ జరగకూడదు. నేను గత 4 రోజులుగా ఇంటికి వెళ్ళడం లేదు. నాకు అమ్మ, నాన్నలను కలవడం ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ రకరకాలుగా ప్రశ్నలు అడుగుతున్నారు. నేను నిర్దోషిని నాకు అన్యాయం జరిగింది. నా మానిసిక పరిస్థితి సరిగా లేదు. నా వైరల్ ఫోటో, వీడియోను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలి. నా పేరును నాశనం చేస్తున్నాయి. ఫోటో, వీడియో తొలగించకపోతే నేను కోర్టుకు వెళ్తాను. ‘ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..