
సినీ హీరో సాయి దుర్గ తేజ్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చిన హీరో సాయి తేజ్ పెళ్లి విషయాన్ని ప్రస్తావించారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో సాయి దుర్గ తేజ్ తిరుమలేశుడిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్న నటుడు.. ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. పెళ్లిపై స్పందించిన సాయి దుర్గ తేజ్.. వచ్చే ఏడాదిలో తన పెళ్లి ఉంటుందని స్పష్టం చేశారు.
మంచి చిత్రాలు, మంచి జీవితం ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానన్నారు. కొత్త సంవత్సరం వస్తున్న తరుణంలో శ్రీవారి ఆశీస్సులు పొందానన్నారు. వచ్చే ఏడాది సంబరాల ఏటిగట్టు చిత్రం వస్తోందన్నారు సాయి దుర్గ తేజ. తల్లి గౌరవార్థం తన పేరును సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్నారు సాయి ధరమ్ తేజ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.