
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటేస్ట్ చిత్రం విరూపాక్ష. డైరెక్టర్ కార్తిక్ దండ్ తెరకెక్కించిన ఈ హార్రర్ అండ్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. మొదటి రోజు ఫస్ట్ షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుని దూసుకుపోతుంది. ఇందులో తేజ్ సరసన సంయుక్త మీనన్ నటించింది. ఈ మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది ఈ మలయాళీ బ్యూటీ. తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్లోనూ ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లు రాబడుతుంది. విడుదలైన ఐదు రోజులు కావోస్తున్న బాక్సాఫీస్ వద్ద విరూపాక్ష దూకుడు మాత్రం తగ్గడం లేదు. భారీగా కలెక్షన్స్ వసూలు చేస్తూ… సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల వసూళ్లు రివీల్ చేశారు మేకర్స్. ఈ ఐదు రోజుల్లోనే రూ. 55 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా కన్ఫార్మ్ చేశారు మేకర్స్. దీంతో ఈ మూవీ సాలిడ్ హెల్డ్ తో కొనసాగుతుందని చెప్పాలి. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా.. రాజీవ్ కనకాల, సునీల్ తదితరులు కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించగా.. సుకుమార్ స్టోరీ అందించారు.
యాక్సిడెంట్ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని తేజ్ నటించిన ఈ చిత్రమిది. ఈ మూవీ సుప్రీం హీరోకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఈ సినిమా హిట్‌తో తేజ్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నారు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
55 Crores in 5 Days ??#Virupaksha is gaining impressive numbers at the Box-office setting new highs in Supreme Hero @IamSaiDharamTej‘s career ❤️#BlockbusterVirupaksha
IN CINEMAS NOW ?https://t.co/HzG8SAAGh7@iamsamyuktha_ @karthikdandu86 @SVCCofficial @SukumarWritings pic.twitter.com/o0BK8Z9EKn— SVCC (@SVCCofficial) April 26, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.