Sirivennela Seetharama Sastry: ఆర్‌ ఆర్‌ ఆర్‌ ట్రైలర్‌, భీమ్లానాయక్‌ పాటల విడుదల వాయిదా..

వెండితెర సాహితీ దిగ్గజం సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూతతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.

Sirivennela Seetharama Sastry: ఆర్‌ ఆర్‌ ఆర్‌ ట్రైలర్‌, భీమ్లానాయక్‌ పాటల విడుదల వాయిదా..
Follow us

|

Updated on: Dec 01, 2021 | 8:45 AM

వెండితెర సాహితీ దిగ్గజం సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూతతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన సాహితీ కలం నుంచి ఇక పాటలు జాలువారవనే నిజాన్ని నమ్మలేకపోతోంది. న్యుమోనియాతో బాధపడుతోన్న సిరివెన్నెల నిన్న కన్ను మూసిన విషయం తెలిసిందే. కొద్దిసేపటి క్రితమే ఆయన పార్థివదేహాన్ని కిమ్స్‌ ఆస్పత్రి నుంచి అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్‌కు తరలించారు ఉంచారు. రాజమౌళి దంపతులు, కీరవాణి, త్రివిక్రమ్, క్రిష్, వెంకటేష్‌, రావు రమేశ్‌ తదితర ప్రముఖులు ఆయన పార్థీవ దేహానికి నివాళి అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. ఫిల్మ్‌ఛాంబర్‌లోని మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు జరగనున్నాయి.

కాగా వెండితెర సాహితీ దిగ్గజం అస్తమయంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ విడుదల వాయిదా పడింది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తోన్న దర్శక ధీరుడు రాజమౌళి ఈ ప్యాన్‌ ఇండియా సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 3న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ను రిలీజ్‌ చేయాలని చిత్రబృందం ముందుగా నిర్ణయించింది. అయితే సీతారామశాస్త్రి కన్నుమూతతో దీనిని వాయిదా వేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ట్రైలర్‌ విడుదల కొత్త తేదీని త్వరలోనే చెబుదామంటూ తెలిపింది. దీంతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘ భీమ్లా నాయక్’ ఫోర్త్‌ సింగిల్‌ ‘ అడవి తల్లి’ పాట విడుదల వాయిదాపడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ పాటను డిసెంబర్ 1న ఉదయం 10:08 గంటలకు విడుదల చేయాల్సి ఉంది. అయితే తాజాగా సాంగ్‌ రిలీజ్‌ను పోస్ట్‌పోన్‌ చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది.

Also read:

Sirivennela Seetharama Sastry: ‘మీరు కన్ను మూస్తే.. మాకు ఈ ప్రపంచం చీకటయ్యింది…’

Sirivennela Seetharama Sastry: ఆయన సంతకం కోసం ప్రయత్నించా కానీ చివరకు.. భావోద్వేగానికి గురైన రాజమౌళి..

Sirivennela: సాహితీ లోకానికి సిరివెన్నెల మిగిల్చిన చివరి గుర్తులు ఇవే.. సీతరామశాస్త్రి రాసిన చివరి పాట ఏంటో తెలుసా.?

Latest Articles