83 Movie : భార‌తీయుల క‌ల‌ను వెండితెర‌పై సాక్షాత్క‌రింప చేయనున్న “83”.. తెలుగు ట్రైలర్

భార‌త‌దేశంలో క్రికెట్‌ను ప్రేమించిన‌, ప్రేమించే, ప్రేమించ‌బోయే ప్ర‌తివారు తెలుసుకోవాల్సిన మ‌ర‌పురాని, మ‌ర‌చిపోలేని అద్భుత‌మైన ప్ర‌యాణం 1983.

83 Movie : భార‌తీయుల క‌ల‌ను వెండితెర‌పై సాక్షాత్క‌రింప చేయనున్న 83.. తెలుగు ట్రైలర్
83
Follow us

|

Updated on: Dec 01, 2021 | 8:21 AM

83 Movie : భార‌త‌దేశంలో క్రికెట్‌ను ప్రేమించిన‌, ప్రేమించే, ప్రేమించ‌బోయే ప్ర‌తివారు తెలుసుకోవాల్సిన మ‌ర‌పురాని, మ‌ర‌చిపోలేని అద్భుత‌మైన ప్ర‌యాణం 1983. ఈ ఏడాదిలో భార‌త క్రికెట్ గ‌మ‌నాన్ని దిశా నిర్దేశం చేసింది. భార‌త క్రికెట్ టీమ్ విశ్వ విజేత‌గా ఆవిర్భ‌వించింది. అలాంటి అద్భుత‌మైన ప్ర‌యాణం గురించి నేటి త‌రంలో చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. అంతెందుకు ఇప్పుడున్నంత సాంకేతిక లేక‌పోవ‌డంతో వార్తాప‌త్రిక‌లు, దూర‌ద‌ర్శ‌న్ వంటి ఛానెల్స్ ద్వారా మాత్ర‌మే క‌పిల్ డేర్ డెవిల్స్ ప్రయాణం గురించి తెలిసింది. అయితే అది గ్రౌండ్‌లో మాత్ర‌మే. అస‌లు ఎవ‌రూ ఊహించ‌ని ఓ ప్ర‌యాణాన్ని సుసాధ్యం చేయాలంటే ఎలాంటి భావోద్వేగాల‌కు క్రికెట్ టీమ్‌లోని స‌భ్యులు లోనై ఉంటారో ఊహించ‌వ‌చ్చు. అలాంటి ఓ ఎమోష‌న‌ల్ జ‌ర్నీయే ‘83’. ఈ భారీ చిత్రం క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబర్ 24న విడుద‌ల‌వుతుంది.

డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్ కొన్ని కోట్ల మంది భార‌తీయుల క‌ల‌ను వెండితెర‌పై సాక్షాత్క‌రింప చేయ‌డానికి అడుగులు వేసిన‌ప్పుడు ఎలా ఉంటుందోన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ‘83’ సినిమా పోస్ట‌ర్స్‌, ప్ర‌మోషన్స్‌.. క‌పిల్ దేవ్ నుంచి మేనేజ‌ర్ మాన్ సింగ్ వ‌ర‌కు ప్ర‌తి ఆట‌గాడిగా న‌టించిన యాక్టర్స్ గురించి క్ర‌మంగా తెలుస్తూ రావ‌డంతో సినిమాపై అంచన‌లు పెరిగాయి. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్ ఈ అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. అయితే మంగ‌ళ‌వారం విడుద‌లైన ‘83’ ట్రైల‌ర్ ఈ అంచ‌నాల‌ను ఆకాశాన్నంటేలా చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్వీర్ సింగ్ అల‌నాటి క‌పిల్‌దేవ్ పాత్ర‌ను పోషించగా..  క‌పిల్ స‌తీమ‌ణి పాత్ర‌ను ర‌ణ్వీర్ నిజ జీవితంలో స‌తీమ‌ణి అయిన దీపికా ప‌దుకొనె క్యారీ చేసింది. ట్రైల‌ర్ విషయానికి వ‌స్తే.. 1983లో ఎంతో కీల‌కంగా భావించిన సెమీఫైన‌ల్ పోరుతో మొద‌లైంది. నిజానికి 1983 సెమీఫైన‌ల్స్‌లో భార‌త టీమ్ జింబాబ్వేను ఎదుర్కొన్న‌ప్పుడు మ్యాచ్ ప్రసారం కాలేదు. ఆ మ్యాచ్‌ను ఎవ‌రూ చూడ‌లేక‌పోయారు. అలాంటి మ్యాచ్‌ను మ‌న క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు ఆవిష్క‌రించారు డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్‌. 9 పరుగుల‌కు నాలుగు వికెట్లు కోల్పోయిన భార‌త టీమ్‌ను ఆనాటి కెప్టెన్ దిగ్విజ‌యంగా 176 ప‌రుగుల‌తో గెలుపు బాట ఎలా ప‌ట్టించాడో.. దాన్ని ‘83’ సినిమాలో చూపించనున్నారు.ఆ మ్యాచ్‌లోని కొన్ని ఎలిమెంట్స్‌తో ట్రైల‌ర్ స్టార్ట్ అయ్యింది.

ఇక ఫైన‌ల్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ వెస్టిండీస్‌ను ఎదుర్కొనే క్ర‌మంలో భార‌త ఆట‌గాళ్లు ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నారు. వాటిని మాన‌సికంగా ఎలా అధిగ‌మించి ప్ర‌పంచ క‌ప్పును ముద్దాడారు అనే విష‌యాల‌ను ఈ ట్రైల‌ర్‌లో ఆవిష్క‌రించారు. నేప‌థ్య సంగీతం, విజువ‌ల్స్ అన్నీ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ ప‌క్కా అని చెప్పేయ‌డ‌మే కాదు.. ప్ర‌తి క్రికెట్ అభిమాని గుండెల్లో నిలిచిపోయే చిత్ర‌మ‌వుతుంద‌ని చెప్ప‌క‌నే చెప్పేస్తుంది. అన్న‌పూర్ణ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో క‌బీర్‌ఖాన్ ఫిలిమ్స్ నిర్మాణంలో దీపికా ప‌దుకొనె, సాజిద్ న‌డియ‌ద్‌వాలా, క‌బీర్ ఖాన్‌, నిఖిల్ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్ లిమిటెడ్, ఫాంట‌మ్ ఫిలింస్ ఈ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామాను నిర్మించారు. క‌పిల్ దేవ్‌గా ర‌ణ్వీర్ సింగ్‌, క‌పిల్ స‌తీమ‌ణి రూమీ భాటియాగా దీపికా ప‌దుకొనె, సునీల్ గ‌వాస్క‌ర్‌గా తాహిర్ రాజ్ బాసిన్‌, కృష్ణ‌మాచార్య శ్రీకాంత్‌గా జీవా, మ‌ద‌న్ లాల్‌గా హార్డీ సందు, మ‌హీంద్ర‌నాథ్ అమ‌ర్‌నాథ్‌గా స‌కీబ్ స‌లీమ్‌, బ‌ల్వీంద‌ర్ సంధుగా అమ్మి విర్క్‌, వికెట్ కీప‌ర్ స‌య్య‌ద్ కిర్మాణిగా సాహిల్ క‌త్తార్‌, సందీప్ పాటిల్‌గా చిరాగ్ పాటిల్‌, దిలీప్ వెంగ్‌స‌ర్కార్‌గా అదినాథ్ కొతారె, ర‌విశాస్త్రిగా కార్వా.. మేనేజ‌ర్ మాన్‌సింగ్‌గా పంక‌జ్ త్రిపాఠి త‌దిత‌రులు న‌టించారు. ఇండియ‌న్ క్రికెట్‌లో మ‌ర‌చిపోలేని అమేజింగ్ జ‌ర్నీతో రూపొందిన ‘83’ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 24న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sirivennela Seetharama Sastry: ‘మీరు కన్ను మూస్తే.. మాకు ఈ ప్రపంచం చీకటయ్యింది…’

Sirivennela Seetharama Sastry: ఆయన సంతకం కోసం ప్రయత్నించా కానీ చివరకు.. భావోద్వేగానికి గురైన రాజమౌళి..

Sirivennela: సాహితీ లోకానికి సిరివెన్నెల మిగిల్చిన చివరి గుర్తులు ఇవే.. సీతరామశాస్త్రి రాసిన చివరి పాట ఏంటో తెలుసా.?

కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!