కన్నడ రాకింగ్ స్టార్ యశ్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 2 (KGF 2) ప్రభంజనం సృష్టిస్తోంది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. అధ్భుతమైన విజువల్ ఎఫెక్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా టాలీవుడ్ గత రికార్డులను తిరగరాస్తూ.. దూసుకుపోతుంది. యశ్ నటనపై.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ పై ప్రశంసలు కురిపించారు. సౌత్ మాత్రమే కాదు.. నార్త్ ఆడియన్స్ నుంచి కేజీఎఫ్ 2 సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికీ ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో యశ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఆడియన్స్ మొత్తం కేజీఎఫ్ 3 పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 3 ఎప్పుడెప్పుడు వస్తోందా అని ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. హోంబలే ఫిలింస్.. ఆర్సీబీ కలిసి ప్రేక్షకులకు డబుల్ బోనాంజా ఇచ్చేందుకు ఓ జాయింట్ వెంచర్ లో భాగస్వాములైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ముందు ఆర్సీబీ జట్టు ప్లేయర్స్ అందరికీ కేజీఎఫ్ 2 సినిమాను ఫ్రాంచైజీ స్పెషల్ స్క్రీనింగ్ వేసింది. ఈ సినిమాతో తమకు మనసు కాస్త తేలికపడిందని.. ఇప్పుడు ప్రశాంతంగా ఉందని తెలిపారు. మ్యాక్స్ వెల్, సిరాజ్, హర్షల్ పటేల్ సినిమా నచ్చిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. తామంతా కేజీఎఫ్ 3 సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇటీవల సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రొడ్యూసర్ విజయ్ కిర్గందూర్ ఆర్సీబీ, ఎల్ఎస్జీ మధ్య జరిగిన మ్యాచ్‌ను చూసిన సంగతి తెలిసిందే.
Samantha : విజయ్ దేవరకొండతో సామ్ సినిమా.. ఘనంగా మూవీ లాంచ్.. ఎక్కడా కనిపించని హీరోయిన్.. ఎందుకంటే..
Kajal Aggarwal: బిడ్డ పుట్టాక కాజల్ భావోద్వేగ పోస్ట్.. కష్టమంతా మర్చిపోయానంటూ..
RRR OTT: ఇక ఓటీటీ వంతు.. డిజిటల్ స్క్రీన్‌పై ట్రిపులార్ సందడి చేసేది ఆ రోజే.. ఎప్పుడు, ఎక్కడా.?