Raj Tarun-Lavanya: రాజ్ తరుణ్ స్నేహితుడు ఆర్‌జే శేఖర్ బాషాపై దాడి.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి వీడియో రిలీజ్

|

Aug 05, 2024 | 4:33 PM

గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ మీడియా ముందుకు రాలేదు. అతని తరఫున స్నేహితుడు ఆర్జే శేఖర్ బాషా రంగంలోకి దిగి లావణ్యపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమె అమాయకులకు డ్రగ్స్‌ అలవాటు చేసి.. వారి వీడియోలు చిత్రీకరించి.. బెదిరింపులకు పాల్పడుతుందంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.

Raj Tarun-Lavanya: రాజ్ తరుణ్ స్నేహితుడు ఆర్‌జే శేఖర్ బాషాపై దాడి.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి వీడియో రిలీజ్
Lavanya, Rj Shekar Basha
Follow us on

ప్రముఖ సినీనటుడు రాజ్‌తరుణ్‌ – లావణ్య వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. రాజ్‌ తరుణ్‌ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని లావణ్య నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ప్రతిగా రాజ్ తరుణ్ కూడా ఆమెపై సంచలన ఆరోపణలు చేయడం, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాను కూడా ఇందులోకి లాగడంతో ఈ వ్యవహరం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ మీడియా ముందుకు రాలేదు. అతని తరఫున స్నేహితుడు ఆర్జే శేఖర్ బాషా రంగంలోకి దిగి లావణ్యపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమె అమాయకులకు డ్రగ్స్‌ అలవాటు చేసి.. వారి వీడియోలు చిత్రీకరించి.. బెదిరింపులకు పాల్పడుతుందంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం ఇది లావణ్య-శేఖర్ బాషాల వివాదంగా మారిపోయింది. మూడు రోజుల క్రితం ఓ టీవీ డిబేట్ లో లావణ్య.. శేఖర్ బాషాపై చెప్పుతో దాడి చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడీ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. శేఖర్‌ బాషాపై దాడి జరిగింది. ప్రస్తుతం ఆయన కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు లావణ్య, ఆమె మద్దతుదారులు తనపై దాడి చేశారంటూ ఆస్పత్రి బెడ్ పై నుంచే ఒక వీడియోను రిలీజ్ చేశాడు శేఖర్ బాషా. ప్రస్తుతం ఈ వీడియ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మొన్నటి వరకు నేను రాజ్ తరుణ్‌-లావణ్య కేసులో అసలేం జరిగిందనేదే చెప్పాను. అప్పటి వరకు లావణ్య పెద్దగా రియాక్ట్‌ అవ్వలేదు. కానీ, ఎప్పుడైతే డ్రగ్స్ గురించి విషయాలు బయట పెట్టానో ఆమె మరింతగా రెచ్చిపోతోంది. బాధితుల పేర్లు ఆధారాలతో సహా నేను బయటపెట్టగానే లావణ్య నాపై చెప్పులు విసిరింది. ఇదంతా లైవ్ లో మీరు చూసే ఉంటారు. అయినా నా ప్రశ్నలకు మాత్రం ఆమె సమాధానం చెప్పలేదు. మీరు గమనించారో లేదో ఎప్పుడైతే నేను ప్రీతి పేరు బయటకు లాగానో లావణ్య వెంటనే రియాక్ట్‌ అవుతుంది. గట్టిగా అరుస్తూ రచ్చ చేస్తుంది . మళ్లీ నేను ఇంకేం ఆధారాలు తీసుకువస్తాననో అని భయపడి నాపై దాడి చేయించింది. ఆదివారం (ఆగస్టు 04) రాత్రి లావణ్య, ఆమె మద్దతు దారులు నా ఇంటిపై దాడి చేశారు. నన్ను బాగా కొట్టారు. నా కుటుంబ సభ్యులు వద్దంటున్నా.. నేను మాత్రం డ్రగ్స్ మాఫియాపై పోరాడుతుంటాను’ అని వీడియోలో చెప్పుకొచ్చాడు శేఖర్ బాషా. మరి రాబోయే రోజుల్లో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి

ఆస్పత్రిలో ఆర్ జే శేఖర్ బాషా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.