AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kantara: Chapter 1: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కాంతారా టీజర్.. మిలియన్స్ కొద్దీ వ్యూస్

అన్ని బాషాల్లో ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో 'కాంతారా ' ప్రీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . నవంబర్ 27న విడుదలైన 'కాంతారా చాప్టర్ 1' ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయ్యింది. ఏడు భాషల్లో విడుదలైన ఈ టీజర్‌కు 12 మిలియన్లు అంటే 1.2 కోట్ల వ్యూస్ వచ్చాయి. దాంతో నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ టీజర్.

Kantara: Chapter 1: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కాంతారా టీజర్.. మిలియన్స్ కొద్దీ వ్యూస్
Kantara 2
Rajeev Rayala
|

Updated on: Nov 28, 2023 | 5:07 PM

Share

రిషబ్ శెట్టి హీరోగా నటించి.. దర్శకత్వం వహించిన ‘కాంతారా ’ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.. ముందుగా కన్నడ లో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఇతరభాషల్లో రిలీజ్ అయ్యింది. అన్ని బాషాల్లో ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ‘కాంతారా ‘ ప్రీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . నవంబర్ 27న విడుదలైన ‘కాంతారా చాప్టర్ 1’ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయ్యింది. ఏడు భాషల్లో విడుదలైన ఈ టీజర్‌కు 12 మిలియన్లు అంటే 1.2 కోట్ల వ్యూస్ వచ్చాయి. దాంతో నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ టీజర్.

గతేడాది ‘కాంతారా’ సినిమా విడుదలైంది. దీని తర్వాత రిషబ్ శెట్టి రెండో భాగం చేయడానికి సిద్దమయ్యాడు. స్క్రిప్ట్ వర్క్ కోసం చాలా ఎఫర్ట్ పెట్టాడు రిషబ్. చాలా కాలంగా స్క్రిప్ట్ పై పని చేసి కథను సిద్ధం చేసుకున్నాడు. నవంబర్ 27న కుందాపూర్ ఆనెగుడ్డె ఆలయంలో చిత్ర బృందం స్క్రిప్ట్ పూజను నిర్వహించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాటీజర్ ను కూడా విడుదల చేసింది.

రిషబ్ శెట్టి ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో గొడ్డలి పట్టుకుని ఉన్న లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇది లైట్‌ విజన్‌ ​​కాదు’ అనే డైలాగ్‌ క్యాప్షన్ గా ఇచ్చారు. ‘కాంతారా’ సినిమాలో ఈ డైలాగ్ హైలెట్ అయింది. ఆ డైలాగ్ ఇక్కడ కూడా ఉపయోగించారు. కదంబ యుగం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ప్రస్తుతం రిషబ్ శెట్టి కథ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. గతంలో ఏం జరిగిందో చెప్పబోతున్నాం. బాధ్యత పెరుగుతుంది.ఈ  సినిమా గురించి కథే మాట్లాడుతుందని రిషబ్ శెట్టి అన్నారు. ‘కాంతారా’ సినిమా ప్రారంభంలోనే ఓ రాజు కథ  చూపించారు. ‘కాంతారావు చాప్టర్ 1’ సినిమాకి ఇదే మూలం అని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి