AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishab Shetty: బాలీవుడ్ సినిమాలు ఫెయిల్ కావడానికి కారణమదే.. రిషబ్ శెట్టి సెన్సెషనల్ కామెంట్స్..

హిందీలో కాంతార సినిమా ఇప్పటికే రూ. 54 కోట్లు వసూలు చేసింది. కేజీఎఫ్ తర్వాత రెండవ అతి పెద్ద కన్నడ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో కిషోర్, సప్తమి గౌడ మరియు అచ్యుత్ కుమార్ కూడా నటించారు.

Rishab Shetty: బాలీవుడ్ సినిమాలు ఫెయిల్ కావడానికి కారణమదే.. రిషబ్ శెట్టి సెన్సెషనల్ కామెంట్స్..
Rishab Shetty Kantara
Rajitha Chanti
|

Updated on: Nov 06, 2022 | 1:17 PM

Share

కాంతార సినిమా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు రిషబ్ శెట్టి. ఆయన స్వియ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన అన్ని భాషల్లోనూ భారీగా కలెక్షన్స్ రాబడుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. అంతేకాదు కాంతార చిత్రంతో కేరళ.. కర్ణాటక ఆదివాసీల భూతకోల ఆచార సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేశారు. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగ ఉత్తరాదిలో ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి.. బాలీవుడ్ చిత్రాలు వరుసగా పరాజయం కావడం పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే.. పరోక్షంగా మేకర్స్‏ కు చురకలు అంటించారు. ఒక సినిమాను వ్యక్తిగత వినియోగం కోసం కాకుండా.. ప్రేక్షకులకు ప్రాధాన్యతనిస్తూ వారి అభిరుచిని దృష్టిలో ఉంచుకుని సినిమాలను రూపొందించాలని అన్నారు.

హిందుస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. “మేము సినిమాని ప్రేక్షకుల కోసం చేస్తాము, మా కోసం కాదు. ఆడియన్స్ ను.. వారి మనోభావాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి. వారి విలువలు, జీవన విధానం ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. మేము సినిమా నిర్మాతలు కాక ముందే ప్రేక్షకులలో ఉన్నాము. కానీ ప్రస్తుతం చాలా వరకు ఎక్కువగా పాశ్చాత్య ప్రభావం కనిపిస్తోంది. హాలీవుడ్ కంటెంట్..ఇతర కంటెంట్ తెరకెక్కించేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఎందుకు ప్రయత్నించడం ?.. హాలీవుడ్ ప్రభావాన్ని ఇప్పటికే ప్రజలు రుచి చూశారు. విదేశాల్లో కథ, కథనం, నాణ్యత, ప్రదర్శనల పరంగా ఎంతో మెరుగ్గా చేస్తున్నారు. ” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

హిందీలో కాంతార సినిమా ఇప్పటికే రూ. 54 కోట్లు వసూలు చేసింది. కేజీఎఫ్ తర్వాత రెండవ అతి పెద్ద కన్నడ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో కిషోర్, సప్తమి గౌడ మరియు అచ్యుత్ కుమార్ కూడా నటించారు. ఈ సినిమాలో స్థానిక ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఆధిపత్య పోరును చూపించారు.