Kantara Chapter 1: 650 కోట్ల కలెక్షన్ల సినిమా.. రిషబ్ శెట్టి ‘కాంతారా 2’లో ఈ మిస్టేక్‌ను గమనించారా?

ఎంత పెద్ద సినిమా తీస్తున్నప్పుడైనా చిన్న చిన్న తప్పులు జరగడం సహజం. సినిమా హిట్ అయితే అవన్నీ పెద్దగా కనిపించవు. కానీ కొందరు నెటిజన్లు మాత్రం చిన్న చిన్న తప్పులను కూడా ఇట్టే పట్టేస్తుంటారు. ఇప్పుడు 'కాంతార ఛాప్టర్ 1'లో కూడా ఒక పెద్ద పొరపాటుని నెటిజన్లు బయటపెట్టారు. ఇప్పుడది బాగా వైరల్ అయిపోతోంది.

Kantara Chapter 1: 650 కోట్ల కలెక్షన్ల సినిమా.. రిషబ్ శెట్టి కాంతారా 2లో ఈ  మిస్టేక్‌ను గమనించారా?
Kantara Chapter 1

Updated on: Oct 13, 2025 | 7:38 PM

కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతార ఛాప్టర్ 1. సుమారు మూడేళ్ల క్రితం రిలీజై సంచలన విజయం సాధించిన కాంతార సినిమాకు ఇది ప్రీక్వెల్. రిషభ్ శెట్టి పక్కన రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించింది. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ప్రతినాయకుడిగా కనిపించాడు. దసరా కానుకగా అక్టోబర్ 02న రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల కాంతార ఛాప్టర్ 1 సినిమాలోని బ్రహ్మకలశం ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఇందులో ఒక చిన్న మిస్టేక్ ను బయట పెట్టారు నెటిజన్లు. ఇప్పుడది నెట్టింట బాగా వైరలవుతోంది.

2022లో వచ్చిన ‘కాంతార’ సినిమాను వర్తమాన కాలంలోనే జరుగుతున్నట్లు తీశారు. అయితే కాంతార ఛాప్టర్ 1 సినిమాను మాత్రం 16వ శతాబ్దంలో జరిగే కథగా తెరకెక్కించారు. దీంతో సినిమాలో అప్పటి పరిస్థితులను ప్రతిబింబించేలా చిత్ర బృందం చాలా కష్ట పడింది. అడవిలో సెట్ వర్క్, నటీనటుల కాస్ట్యూమ్స్ ను చక్కగా చూపించారు. అయితే ఒక్క చోట మాత్రం కాంతార టీమ్ అడ్డంగా దొరికిపోయింది. సినిమా సెకండాఫ్ లో బ్రహ్మకలశం సాంగ్ వస్తుంది. గూడెంలో ఉండే దేవుడిని రాజు ఉండే చోటుకు తీసుకొచ్చే సందర్భంలో ఈ పాట వస్తుంది.

ఇవి కూడా చదవండి

ప్లాస్టిక్  వాటర్ క్యాన్ ను గమనించారా?

ఈ పాటలో రిషభ్ శెట్టి తమ దేవుడిని తలపై పెట్టుకుని తీసుకురావడం, తర్వాత స్నానమాచరించి నిష్టతో పూజలు చేయడం.. ఇలా బాగానే చూపించారు. అయితే అందరూ కలిసి కింద కూర్చుని సామూహిక భోజనాలు చేస్తున్న సన్నివేశంలో మాత్రం ఓ చోట 20 లీటర్ల ప్లాస్టిక్ వాటర్ క్యాన్ కనిపించింది. బహుశా షూటింగ్ చేస్తున్నప్పుడు దీన్ని అక్కడి నుంచి తీయడం మర్చిపోయినట్లున్నారు. ఇటీవల విడుదలైన బ్రహ్మకలశ సాంగ్ లో అది క్లియర్ గా కనిపించింది. వీడియో సాంగ్‌లో సరిగ్గా 3:06 నిమిషాల వద్ద ఈ పొరపాటుని గమనించొచ్చు. ఇప్పుదది నెట్టింట వైరల్ గా మారింది. 16వ శతాబ్దంలో ప్లాస్టిక్ వాటర్ క్యాన్ ఎలా వచ్చిందబ్బా అని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

బ్రహ్మకలశ ఫుల్ వీడియో సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.