‘చోటా సుశాంత్’ కావాల‌ని కోరుకున్నా : రియా

సుశాంత్ సింగ్ కేసులో అతని గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి పాత్ర‌పై ప్ర‌జ‌లు ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్పటికే ఆమెను సీబీఐ, ఈడీ, నార్కోటిక్ డిపార్ట్మెంట్స్ విచారిస్తున్నాయి.

  • Ram Naramaneni
  • Publish Date - 7:24 pm, Fri, 28 August 20
'చోటా సుశాంత్' కావాల‌ని కోరుకున్నా : రియా

సుశాంత్ సింగ్ కేసులో అతని గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి పాత్ర‌పై ప్ర‌జ‌లు ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్పటికే ఆమెను సీబీఐ, ఈడీ, నార్కోటిక్ డిపార్ట్మెంట్స్ విచారిస్తున్నాయి. ఓ వర్గం మీడియా కూడా రియాపై రుస‌రుస‌లాడుతోంది. ఈ క్రమంలోనే ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న రియా తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలో ప‌లు కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. అందులో రియా చెప్పిన విష‌యాల‌తో సోషల్ మీడియాలో మరో కొత్త చ‌ర్చ మొద‌లైంది.

బిడ్డను క‌నాలనుకున్నా..

సుశాంత్ లాంటి గొప్ప యాక్ట‌ర్ అయ్యే చోటా సుశాంత్ కావాల‌ని కోరుకున్న‌ట్లు రియా తెలిపారు. త‌న‌ దృష్టిలో సుశాంత్ భూమ్మీద అందరిలోకెల్లా ఓ గొప్ప మనిషిగా అభివ‌ర్ణించింది రియా. త‌న‌కు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని, పైనుంచి సుశాంత్ వీటన్నంటిని చూస్తూనే ఉంటాడ‌ని పేర్కొంది. ప్రజలు కూడా నిజానిజాలు తెలుసుకోవాలని, త‌న వైపు నుంచి కూడా ఆలోచించాల‌ని కోరుతోంది. సుశాంత్ కేసులో త‌న‌ను విలన్‌ను చేయాలని చూస్తున్నార‌ని, ఎవ‌రైనా తనకు కావాల్సిన వారిని కోల్పోయిన వారినే నిందించడం కరెక్ట్ కాద‌ని చెప్పింది.

Also Read :

ఈ గొర్రె రేటెంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే !

సోంపేటలో 19 మంది వాలంటీర్లపై వేటు