విద్యార్థి మూవీ టీజర్ రిలీజ్

టాలీవుడ్ న్యూమూవీ 'విద్యార్థి' టీజర్ రిలీజైంది. 'ఎ లోన్ ఫైట్ ఫ‌ర్ ల‌వ్' అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. 'రాజుగారి గ‌ది' ఫేమ్ చేత‌న్ చీను, టిక్‌టాక్ ఫేమ్ బ‌న్నీ వాక్స్ (వ‌ర్షిణి) హీరో హీరోయిన్లుగా ఈ సినిమాలో న‌టిస్తున్నారు.

విద్యార్థి మూవీ టీజర్ రిలీజ్
Follow us

|

Updated on: Aug 28, 2020 | 7:16 PM

టాలీవుడ్ న్యూమూవీ ‘విద్యార్థి’ టీజర్ రిలీజైంది. ‘ఎ లోన్ ఫైట్ ఫ‌ర్ ల‌వ్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. ‘రాజుగారి గ‌ది’ ఫేమ్ చేత‌న్ చీను, టిక్‌టాక్ ఫేమ్ బ‌న్నీ వాక్స్ (వ‌ర్షిణి) హీరో హీరోయిన్లుగా ఈ సినిమాలో న‌టిస్తున్నారు. శుక్ర‌వారం ఈ సినిమా టీజ‌ర్‌ను ద‌ర్శ‌కులు సురేంద‌ర్‌రెడ్డి, హ‌రీష్ శంక‌ర్.. నిర్మాత‌లు సాయి కొర్ర‌పాటి, కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ విడుద‌ల చేశారు. మ‌హాస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజేటి రామ‌కృష్ణ‌, వంశీ తాడికొండ, ఆళ్ల వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌ధు మాదాసు ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం. టీజ‌ర్‌ విషయానికొస్తే.. ఉద్వేగ‌, ఉత్తేజ‌ భ‌రిత‌మైన క‌థ‌తో ఈ సినిమా నడుస్తుందని టీజర్ చెబుతోంది. హీరో ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తుండగా, ‘మ‌న జాతీయ గీతం మీద అంత గౌర‌వం ఉన్న మీకు మా జాతంటేనే ఎందుకు సార్ అంత కోపం’ అనే హీరో మాట‌ల‌ు సినిమా నేపథ్యాన్ని తెలియజేస్తున్నాయి.

హీరో హీరోయిన్లు ప్రేమించుకోవ‌డాన్ని స‌హించ‌లేని హీరోయిన్ ఫ్యామిలీ.. హీరోనీ, అత‌డి ఫ్రెండ్స్‌నీ హ‌త్య చేయించ‌డానికి ప్లాన్ చేస్తే.. హీరో ఒంట‌రిగా పోరాడాడ‌నీ టీజ‌ర్ ద్వారా అర్థ‌మ‌వుతోంది. సినిమాలో 5 పాట‌లు, 6 ఫైట్ల‌తో పాటు భారీ స్థాయిలో చిత్రీక‌రించిన క‌బ‌డ్డీ ఎపిసోడ్ ఉన్నాయని చిత్ర యూనిట్ చెప్పింది. రెండు మూడు రోజుల ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌యిందని.. గుంటూరు, రాజ‌మండ్రి, వైజాగ్‌, అర‌కు వంటి లొకేష‌న్ల‌లో 42 రోజుల పాటు సింగిల్ షెడ్యూల్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రిపినట్లుగా వివరించింది.

Latest Articles
ఈ ఒకే ఒక్క సాంగ్ సినిమా ఏకంగా ఏడాది ఆడేలా చేసింది..
ఈ ఒకే ఒక్క సాంగ్ సినిమా ఏకంగా ఏడాది ఆడేలా చేసింది..
ల్యాండ్ టైటలింగ్‎పై టీడీపీ అసత్య ప్రచారం.. చంద్రబాబుపై కౌంటర్..
ల్యాండ్ టైటలింగ్‎పై టీడీపీ అసత్య ప్రచారం.. చంద్రబాబుపై కౌంటర్..
గుజరాత్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన RCB.. టీమ్‌లో ఎవరున్నారంటే?
గుజరాత్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన RCB.. టీమ్‌లో ఎవరున్నారంటే?
ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారంలో టీడీపీపై ఈసీ సీరియస్.. సీఐడీ విచారణ
ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారంలో టీడీపీపై ఈసీ సీరియస్.. సీఐడీ విచారణ
రూ. 999కే నాయిస్ కొత్త బడ్స్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 50 గంటలు
రూ. 999కే నాయిస్ కొత్త బడ్స్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 50 గంటలు
మరీ ఇంత కాన్ఫిడెన్సా.. ఉద్యోగం కోసం వింత ప్రతిపాదన..
మరీ ఇంత కాన్ఫిడెన్సా.. ఉద్యోగం కోసం వింత ప్రతిపాదన..
మా అమ్మముందే నన్ను కమిట్‌మెంట్ అడిగారు..
మా అమ్మముందే నన్ను కమిట్‌మెంట్ అడిగారు..
మీరు తాగే టీలో చిటికెడు ఉప్పు కలపండి.. ఏం జరుగుతుంది అంటే..?
మీరు తాగే టీలో చిటికెడు ఉప్పు కలపండి.. ఏం జరుగుతుంది అంటే..?
నామినీ ఇక ఆప్షనల్.. జాయింట్ అకౌంట్ హోల్డర్లకు వెసులుబాటు
నామినీ ఇక ఆప్షనల్.. జాయింట్ అకౌంట్ హోల్డర్లకు వెసులుబాటు
'చంద్రబాబుది ఊరసవెల్లి రాజకీయం'.. సింహపురి ఎన్నికల ప్రచారంలో జగన్
'చంద్రబాబుది ఊరసవెల్లి రాజకీయం'.. సింహపురి ఎన్నికల ప్రచారంలో జగన్