Ram Gopal Varma: ఆర్జీవీ మరో సంచలన ట్వీట్.. ఇందిరాగాంధీ బాగా నటించారంటూ..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆర్జీవీ ఎక్కడుంటే అక్కడ వివాదం ఉంటుంది.. ఆయన చేసే కామెంట్స్ పెద్దపెద్ద చర్చలకు దారితీస్తుంటాయి

Ram Gopal Varma: ఆర్జీవీ మరో సంచలన ట్వీట్.. ఇందిరాగాంధీ బాగా నటించారంటూ..
Rgv

Updated on: Jul 25, 2022 | 8:23 AM

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆర్జీవీ ఎక్కడుంటే అక్కడ వివాదం ఉంటుంది.. ఆయన చేసే కామెంట్స్ పెద్దపెద్ద చర్చలకు దారితీస్తుంటాయి. ఇక ఆర్జీవీ సినిమాల గురించి కూడా అందరికి తెలిసిందే.. బోల్డ్ సినిమాలు, వైలెంట్ మూవీస్ తో ఆర్జీవీ చేసే రచ్చ అంతా ఇంత కాదు. కానీ ఆర్జీవీ సినిమాలంటే ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి ఉంటుంది. చాలా మంది ఆయనను ఇంస్ప్రెషన్స్ గా కూడా తీసుకుంటూ ఉంటారు. కేవలం సినిమాలతోనే కాదు సోషల్ మీడియా ద్వారా కూడా ఆర్జీవీ హాట్ టాపిక్ అవుతూ ఉంటారు. ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ షేర్ చేసే పోస్ట్ లు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరోసారి సంచలన కామెంట్స్ చేశారు ఆర్జీవీ. ఈసారి ఏకంగా మాజీ ప్రధాని, దివంగత నేత ఇందిరాగాంధీని ఉద్దేశించి కామెంట్స్ చేశారు ఆర్జీవీ. ఇందిరాగాంధీ పాత ఇంటర్వ్యూని షేర్ చేసిన ఆర్జీవీ.. ఆమె బాగా నటించారని కామెంట్ చేశారు.

కంగనా రనౌత్ హీరోయిన్ గా ఎమర్జెన్సీ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇందిరాగాంధీ జీవితకథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కనగానా ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కానగన్ రనౌత్ ఇందిరాగాంధీ లుక్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. అయితే తాజాగా ఇందిరాగాంధీ పాత వీడియోను షేర్ చేసిన ఆర్జీవీ.. ఇందిరాగాంధీ అచ్ఛం కంగనా లా నటించారంటూ రాసుకొచ్చారు వర్మ. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ట్వీట్ పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఈ ట్వీట్ ఎలాంటి వివాదాన్ని రేపుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి