Saree Movie: చీర అమ్మాయిని హీరోయిన్ చేసిన వర్మ.. ‘శారీ’ ఫస్ట్ లుక్ రిలీజ్.. శ్రీలక్ష్మీ సతీష్ పోస్టర్ వైరల్..

ఇంకేముంది నెటిజన్స్ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు. ఆ అమ్మాయి ఇన్ స్టా ఐడీ కనుక్కొని వర్మకు రిప్లై కూడా ఇచ్చారు. ఆ అమ్మాయి వీడియోస్ పోస్ట్ చేస్తూ.. తనను చీర అనే సినిమా తీస్తానని ప్రకటించారు. ఆ అమ్మాయిని అందంగా వీడియోస్ తీసిన కెమెరామెన్ ను పిలిపించి మాట్లాడాడు. ఆమె పేరు శ్రీలక్ష్మీ సతీష్. ఇప్పుడు ఈ అమ్మాయితో శారీ అనే సినిమా తీస్తున్నాడు వర్మ. ఈ చిత్రానికి ఆ అమ్మాయిని అందగా వీడియోస్ తీసిన కెమెరామెన్ దర్శకుడు కావడం విశేషం.

Saree Movie: చీర అమ్మాయిని హీరోయిన్ చేసిన వర్మ.. 'శారీ' ఫస్ట్ లుక్ రిలీజ్.. శ్రీలక్ష్మీ సతీష్ పోస్టర్ వైరల్..
Sreelakshmi Satheesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 21, 2023 | 2:01 PM

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటారో చెప్పక్కర్లేదు. కొద్దిరోజుల క్రితం చీర కట్టుకుని రీల్స్ చేసిన అమ్మాయి వీడియోస్ తెగ షేర్ చేశాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా ?.. తెలిస్తే చెప్పండి అంటూ పోస్టులు చేశాడు. ఆర్జీవి చేసిన పోస్టులు క్షణాల్లోనే వైరలయ్యాయి. ఇంకేముంది నెటిజన్స్ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు. ఆ అమ్మాయి ఇన్ స్టా ఐడీ కనుక్కొని వర్మకు రిప్లై కూడా ఇచ్చారు. ఆ అమ్మాయి వీడియోస్ పోస్ట్ చేస్తూ.. తనను చీర అనే సినిమా తీస్తానని ప్రకటించారు. ఆ అమ్మాయిని అందంగా వీడియోస్ తీసిన కెమెరామెన్ ను పిలిపించి మాట్లాడాడు. ఆమె పేరు శ్రీలక్ష్మీ సతీష్. ఇప్పుడు ఈ అమ్మాయితో శారీ అనే సినిమా తీస్తున్నాడు వర్మ. ఈ చిత్రానికి ఆ అమ్మాయిని అందగా వీడియోస్ తీసిన కెమెరామెన్ దర్శకుడు కావడం విశేషం.

శ్రీలక్ష్మీ సతీష్.. మోడ్రన్ దుస్తుల్లో కాకుండా చీరకట్టులో ఫోటోషూట్స్ చేస్తుంది. చీర కట్టులో ప్రకృతిని ఆస్వాదిస్తూ కొన్ని రీల్స్ చేసింది. అవి చూసిన వర్మ… ఆ అమ్మాయి కోసం వెతుకులాట ప్రారంభించారు. ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే చెప్పాలంటూ వరుసగా వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఎట్టకేలకు ఆమె ఇన్ స్టా ఐడీ కనిపెట్టారు నెటిజన్స్.

శ్రీలక్ష్మీ సతీష్ కథానాయికగా.. ఆమెను ఫోటోస్ తీసిన కెమెరామెన్ అఘోష్ దర్శకుడిగా పరిచయం చేస్తూ శారీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు వర్మ. తాజాగా ఈరోజు ఇంటర్నేషనల్ శారీ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ఆర్జీవీ డెన్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శారీ సినిమాను నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ వర్మ ట్వీట్ చేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.