AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. నేను కూడా చెయ్యాలనుకున్నా.. కానీ మిస్ అయ్యింది

గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రేణూ దేశాయ్ పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. అయితే 2023 లో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె పోషించిన హేమలతా లవణం పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.

ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.. నేను కూడా చెయ్యాలనుకున్నా.. కానీ మిస్ అయ్యింది
Renu Desai
Rajeev Rayala
|

Updated on: Jan 17, 2026 | 1:04 PM

Share

ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసి ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు రేణు దేశాయ్. చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. దీంతో రేణు మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. ఆ మధ్య రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్  ప్రారంభించారు రేణూ దేశాయ్.  టైగర్ నాగేశ్వర రావు సినిమా 2023లో విడుదలైంది. ఆతర్వాత ఇప్పటివరకు ఏ కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదీ అందాల తార. మొన్నీమధ్యనే బ్యాడ్ గర్ల్స్ అనే సినిమాలో నటించారు రేణు.  సినిమాల విషయం పక్కనపెడితే రేణూ దేశాయ్ సామాజిక సేవా కార్యక్రమాలతో బిజి బిజీగా ఉంటారు. అనాథ పిల్లలు, పర్యావరణం, మూగ జీవాల సంరక్షణ కోసం తన వంతు కృషి చేస్తుంటారు.

అతనంటే నాకు పిచ్చి.. నా గది నిండా ఆ హీరో ఫొటోలే : ఫోక్ డాన్సర్ నాగ దుర్గ

ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు వచ్చే విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని, తనకు నచ్చిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటానని ఆమె స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో విమర్శలను ఎదుర్కొనే విధానం గురించి మాట్లాడుతూ, మొదట్లో ఈ కామెంట్స్ తనను బాధపెట్టేవని, కానీ ఇప్పుడు వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదని రేణు దేశాయ్ అన్నారు.  ప్రజల మనస్తత్వాలు మారవని, వారి మాటలకు సమాధానం చెప్పడం వల్ల ప్రయోజనం లేదని  రేణు దేశాయ్ అన్నారు.

ఆ ముద్దుగుమ్మకు పోటీ లేదు.. స్టార్ హీరోయిన్స్ కూడా ఆవిడనే ఫాలో అయ్యేవారన్న బాలయ్య

అలాగే మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం తనను సంప్రదించినట్లు రేణు దేశాయ్ తెలిపారు. ఆ పాత్ర చేయడానికి తాను ఆసక్తి చూపినప్పటికీ, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ అవకాశం చేజారిపోయిందని రేణు తెలిపారు. ఆ కారణాలను ఇప్పుడు బయటపెట్టడం అనవసర వివాదాలకు దారి తీస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు సినిమాలో ఆమె నటించాల్సింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

అతను నా సినిమాలు చూడడు.. కానీ నన్ను ఓ జంతువులా చూస్తాడు.. అసలు విషయం చెప్పిన ఆర్జీవీ

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..