వారిది నా రక్తం..పవన్‌ది కాదు..రేణూ దేశాయ్ సంచలన కామెంట్స్..

|

Dec 30, 2019 | 3:51 PM

నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్‌ నుంచి విడిపోయిన దగ్గర్నుంచి పిల్లలే జీవితంగా బ్రతకుతోంది రేణూ దేశాయ్. ఆ మధ్యలో త్వరలోనే తనకు ఓ తోడును వెతుక్కోబోతున్నానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అందుకు తగ్గట్లుగానే ఎంగైజ్‌‌మెంట్ అయినట్టుగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. కానీ ఇది జరిగి 4, 5 నెలలు గడుస్తోన్న మళ్లీ పెళ్లి ప్రస్తావన తేలేదు ఈ మాజీ హీరోయిన్.  ప్రస్తుతం ఆమె పిల్లలతో కలిపి పూణెలో నివశిస్తున్నారు. తన పిల్లలకు సంబంధించిన […]

వారిది నా రక్తం..పవన్‌ది కాదు..రేణూ దేశాయ్ సంచలన కామెంట్స్..
Follow us on

నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్‌ నుంచి విడిపోయిన దగ్గర్నుంచి పిల్లలే జీవితంగా బ్రతకుతోంది రేణూ దేశాయ్. ఆ మధ్యలో త్వరలోనే తనకు ఓ తోడును వెతుక్కోబోతున్నానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అందుకు తగ్గట్లుగానే ఎంగైజ్‌‌మెంట్ అయినట్టుగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. కానీ ఇది జరిగి 4, 5 నెలలు గడుస్తోన్న మళ్లీ పెళ్లి ప్రస్తావన తేలేదు ఈ మాజీ హీరోయిన్.  ప్రస్తుతం ఆమె పిల్లలతో కలిపి పూణెలో నివశిస్తున్నారు. తన పిల్లలకు సంబంధించిన ప్రతి అప్డేట్‌ను నెటిజన్లతో పంచుకోవడం రేణూకు అలవాటు.

ఇటీవలే రేణూ.. కుమారుడు అకీరా తన సోదరి ఆద్యను ఎత్తుకుని ఉన్న ఫోటోను షేర్ చేసి..వారిద్దరూ క్రేజీ ఫెల్లోస్ అంటూ పేర్కొన్నారు. దీనికి పవన్ అభిమాని ఒకరు ఎంతైనా పవన్ రక్తం కదా..అంతే అంటూ కామెంట్ చేశారు. అతడి కామెంట్‌పై రేణూ ఫైరయ్యింది.  “టెక్నికల్‌గా చూసుకున్నా, సైన్స్‌ పరంగా చెప్పినా వారిద్దరిలో ప్రవహించేది నా రక్తం మాత్రమే. సైన్స్‌ తెలిసినవారికి  ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు” అంటూ ఘాటు రిప్లై ఇచ్చింది. మరో నెటిజన్ స్పందిస్తూ.. ఫ్యాన్స్ ఏవో మాట్లాడుతూ ఉంటారు. వారి మాటలు పట్టించుకుంటే ఎలా అని ప్రశ్నించాడు. అమ్మతనం గురించి మాట్లాడుతుంటే  ఎలా సైలెంట్‌గా ఉంటానంటూ ఎమోషనల్ రిప్లై ఇచ్చింది రేణూ దేశాయ్.