Regina Cassandra: ఆ పాత్రలో నటించడం చాలా సంతోషంగా ఉంది.. ప్రతినాయకి పాత్రపై స్పందించిన రెజీనా..
Regina Cassandra About Her Villain Role In Chakra Movie: ఈ తరం నటీమణులు నటనకు ఉన్న హద్దులను చెరిపేస్తున్నారు. హీరోయిన్లుగా ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న సమయంలోనే ఐటెం సాంగ్‌లతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇక కొందరు భామలు మరో అడుగు..
Regina Cassandra About Her Villain Role In Chakra Movie: ఈ తరం నటీమణులు నటనకు ఉన్న హద్దులను చెరిపేస్తున్నారు. హీరోయిన్లుగా ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న సమయంలోనే ఐటెం సాంగ్‌లతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇక కొందరు భామలు మరో అడుగు ముందుకేసి ప్రతినాయకి పాత్రలో నటిస్తున్నారు. వీరిలో ముందు వరుసలో ఉంటారు అందాల తార రెజీనా. తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ చిన్నది పలు వైవిధ్య పాత్రల్లో నటిస్తోంది. ఈ క్రమంలోనే ‘ఎవరు’ చిత్రంలో ప్రతినాయకి పాత్రలో నటించి ఆకట్టుకుందీ చిన్నది. ఈ సినిమా విజయవంతమవడంలో కీలకపాత్ర పోషిందినడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇదిలా ఉంటే రెజీనా మరోసారి విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. విశాల్ హీరోగా తెరకెక్కిన ‘చక్ర’ సినిమాలో ‘లీలా’ పాత్రలో నటించిన రెజీనా మంచి మార్కులు కొట్టేసింది. ప్రతి నాయకి పాత్రలో కనిపించిన రెజీనా ఈ పాత్రలో జీవించింది. ఈ పాత్ర గురించి రెజీనా మాట్లాడుతూ.. లీలా పాత్రలో నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. దర్శకుడు ఆనందన్ తనను రెండుసార్లు కలిసి కథను వినిపించారని రెజీనా చెప్పుకొచ్చారు. మొదట్లో సినిమాలో నటించడానికి అంగీకరించలేదని.. తర్వాత సినిమాటోగ్రాఫర్ బాలసుబ్రమణ్యన్ ఫోన్ చేసి ప్రతినాయకి పాత్రలో మీరు నటిస్తే బాగుంటుందని చెప్పారని తెలిపారు. దీంతో సినిమాలో నటించడానికి అంగీకరించానని చెప్పుకొచ్చారు. ఇక భవిష్యత్తులోనూ వైవిధ్యభరిత పాత్రల్లో నటించడానికి తాను సిద్ధమేనని తేల్చి చెప్పింది. ఈ లెక్కన చూస్తుంటే.. ఇకపై ప్రతి నాయకి పాత్రలంటే రెజీనానే తొలి ఆప్షన్ అయ్యేలా కనిపిస్తోంది.
Also Read: ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్..హాలీవుడ్ సినిమాలో ఎన్టీఆర్: NTR in Hollywood video