OTT : ఓటీటీలోకి రీసెంట్ డివైన్ బ్లాక్ బస్టర్ అగధ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే
‘‘అగధ… అది ఒక మూఢ నమ్మకమయితే కాదు. చీకటి లోకంలో నుంచి పుట్టుకొచ్చిన ఒక శక్తి’’… ఈ ఒక్క డైలాగ్‌తోనే ‘అగధ’ ప్రపంచం ఎంత మిస్టీరియస్‌గా, ఎంత ఇంటెన్స్‌గా ఉండబోతోందో చెప్పేశారు మేకర్స్. మిస్టరీ, దైవిక శక్తులు, అతీంద్రియ అంశాలతో ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించారు మేకర్స్.

కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో ఎంఎస్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘అగధ’. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్లతో పాటు శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ ముఖ్య పాత్రలను పోషించారు. ఆగస్ట్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా వచ్చే వారం (సెప్టెంబర్ 25) నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది.
Aditi Myakal : మేడమ్ సార్ మేడమ్ అంతే..! మెంటలెక్కిస్తున్న అర్జున్ రెడ్డి భామ
థియేట్రికల్‌గా ‘అగధ’ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. సస్పెన్స్, డివైన్, మిస్టిక్ థ్రిల్లర్‌గా ‘అగధ’ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి పాత్రలతో పాటుగా ఇతర కారెక్టర్స్ కూడా ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఎం ఎస్ రాజు తెరకెక్కించిన విధానం, కెమెరా వర్క్, బీజీఎం ఇలా అన్నీ కూడా సినిమా విజయంలో కీలక పాత్రను పోషించాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని జీ5 తన ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ డివైన్ బ్లాక్ బస్టర్ మూవీ సెప్టెంబర్ 25 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
ఒకే ఒక్క సినిమా.. విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.. కట్ చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది
ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీకి నాని చమిడిశెట్టి కెమెరామెన్‌గా, జునైద్ సిద్ధిఖీ ఎడిటర్‌గా వర్క్ చేశారు. ఈ చిత్రానికి రాకేష్ వెంకటాపురం సంగీతాన్ని అందించారు.
అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య.. ఇద్దరి మధ్య 27ఏళ్ల ఏజ్ గ్యాప్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




