కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna ) ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప సినిమాతో ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఒక్కసారిగా మారిపోయింది. సౌత్ టూ నార్త్ రష్మికకు ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం యానిమల్, మిస్టర్ మజ్ను, గుడ్ బై చిత్రాల్లో నటిస్తుంది. అంతేకాకుండా.. త్వరలోనే పుష్ప 2 చిత్రీకరణలో పాల్గోననుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది గుడ్ బై చిత్రం. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషనల్లో పాల్గోంటుంది రష్మిక. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో భాగంగా సూపర్ మామ్స్ 3లో నటుడు గోవిందాతో కలిసి సామి సామి పాటకు స్టెప్పులేసింది ఈ అమ్మడు. తాజాగా తనపై ఓ అభిమానిని ప్రేమను చూసి ఆశ్చర్యపోయింది.
గుడ్ పై సినిమా ప్రమోషన్లలో పాల్గోంటున్న రష్మికకు ఓ యువకుడు ఎదురుపడి ఆమె ఆటోగ్రాఫ్ కావాలని అడిగాడు. దీంతో ఆమె ఎక్కడ ఇవ్వాలి అడగ్గా.. తన ఛాతిపై ఇవ్వమంటూ ముందుకు వచ్చాడు. దీంతో రష్మిక షాకయ్యింది. అనంతరం అతడి టీషర్టుపై ఆటోగ్రాఫ్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రష్మిక రియాక్షన్ చూసిన నెటిజన్స్.. సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, రష్మిక కలిసి నటించిన గుడ్ బై చిత్రం అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చివరిసారిగా రష్మిక.. డైరెక్టర్ హనురాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాలో నటించింది. ఇటు తమిళంలో విజయ్ దళపతి సరసన వరిసు మూవీలోనూ నటిస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.