AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడకు వెళ్లే అవకాశం ఇన్నాళ్లకు దక్కింది.. నా మనసుకు కలిగిన ప్రశాంతతను మాటల్లో వర్ణించలేను

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ సినిమా రణబాలి. పెళ్లి తర్వాత విరోష్ జంట నటించిన మొదటి సినిమా కావడంతో మొదటి నుంచి ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉండడంతో ఆ అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. అందుకు తగ్గట్టుగానే దసరా కానుకగా 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రణబాలి సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.

అక్కడకు వెళ్లే అవకాశం ఇన్నాళ్లకు దక్కింది.. నా మనసుకు కలిగిన ప్రశాంతతను మాటల్లో వర్ణించలేను
Rashmika Mandanna
Rajeev Rayala
|

Updated on: Oct 19, 2026 | 11:34 AM

Share

టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించిన వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. రీసెంట్ గా ఈ జంట కలిసి నటించిన రణబాలి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇక ఉంటే ఇటీవలే ఈ జోడీ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిని సందర్శించింది. విజయ్ దేవరకొండ చదువుకున్న స్కూల్, తిరిగిన ప్రదేశాలను స్వయంగా చూసి పులకించిపోయిన రష్మిక.. తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. విజయ్ దేవరకొండ స్నేహితులందరినీ తాను ప్రేమగా పర్తి బాయ్స్, పర్తి గర్ల్స్ అని పిలుస్తానని రష్మిక తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా విజయ్ ఎక్కడ పెరిగారు.? ఆయన పాఠశాల రోజులు ఎలా ఉండేవి.? అనే విషయాలను ఎన్నో కథల రూపంలో విన్నాను. ఆయన ఫ్రెండ్స్ అందరూ పుట్టపర్తిలోనే చదువుకున్నారు. వాళ్ల ద్వారా పుట్టపర్తి గురించి ఎన్నోసార్లు విన్నప్పటికీ, నాకు మాత్రం అక్కడకు వెళ్లే అవకాశం ఇన్నాళ్లకు దక్కింది అని రష్మిక భావోద్వేగానికి గురయ్యారు.

నా భర్త మామూలోడు కాదు.. 9మంది అమ్మాయిలను మోసం చేశాడు

విజయ్‌తో కలిసి ఆయన స్కూల్, క్లాస్‌రూమ్స్, హాస్టల్స్‌ని సందర్శించినట్లు రష్మిక తెలిపారు. అక్కడ ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులను, ముఖ్యంగా హెచ్‌ఎం ఆంటీని కలిసే అవకాశం లభించింది. ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు నా మనసుకు కలిగిన ప్రశాంతతను మాటల్లో వర్ణించలేను. చిన్నపిల్లలు ఎంతో భక్తిశ్రద్ధలతో వేదాలు, భజనలు పాడుతుంటే నా మనసు చలించిపోయింది అని అన్నారు. విజయ్, ఆనంద్ దేవరకొండతో పాటు అక్కడి విద్యార్థుల్లో కనిపించే ప్రేమ, దయ, మానవత్వం వంటి విలువలు చూసి తాను ఎప్పుడూ ఆశ్చర్యపోయేదానినని రష్మిక చెప్పారు. అయితే, తాము పుట్టపర్తిని సందర్శించిన తర్వాతే ఆ సుగుణాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తనకు స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. పిల్లలు పెరిగే వాతావరణం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నేర్పించే పాఠాలే వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి అని రష్మిక అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

Tollywood : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఇప్పుడు సినిమాలకు దూరం ఇలా ..

నా జీవితంలోని ఈ దశలోనే పుట్టపర్తిని సందర్శించాలని ఆ స్వామి కోరుకున్నారేమో.! అందుకే ఈ ప్రయాణానికి ఇదే సరైన సమయమనిపించింది. మనకు ఇష్టమైన వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకున్నప్పుడు, వారిని మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతాం అంటూ రష్మిక రాసుకొచ్చారు. రష్మిక షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఈ జంటపై తమదైన శైలిలో ప్రేమను కురిపిస్తున్నారు.

ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా: రష్మిక మందన్న

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us