Rashmika Mandanna: ‘ఇప్పుడు మేం ముగ్గురమయ్యాం’.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన రష్మిక.. నెటిజన్ల క్రేజీ కామెంట్స్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నాల వివాహం జరిగి నెల రోజులు దాటింది. అయినా వీరి పెళ్లి ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్మిక షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Rashmika Mandanna: ఇప్పుడు మేం ముగ్గురమయ్యాం.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన రష్మిక.. నెటిజన్ల క్రేజీ కామెంట్స్
Rashmika Mandanna

Updated on: Apr 03, 2026 | 11:53 AM

మొన్నటివరకు ప్రేమ పక్షులుగా ఉన్న విజయ్‌ దేవరకొండ- రష్మిక మందన్నా ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్నారు. రాజస్థాన్ లోని ఉదయ్‌ పూర్ వేదికగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఆ తర్వాత . ఇక పెళ్లి వేడుక తర్వాత సినీ, రాజకీయ ప్రముఖుల కోసం హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్‌ను కూడా ఏర్పాటు చేశారీ న్యూ కపుల్. అలాగే పలు నగరాల్లో అభిమానులకు అన్నదానం చేయడం, స్వీట్లు పంచడం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇక ఈ కొత్త జంట ఏకాంతంగా హనీమూన్‌కు వెళ్లకుండా ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో బడ్డీ మూన్‌కు వెళ్లింది. అత్యంత సన్నిహితులతో చేసే విహారయాత్రనే ఈ బడ్డీమూన్‌. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరలయ్యాయి. ఇటీవలే ఓ పెళ్లి వేడుకలోనూ తళుక్కుమన్నారు రష్మిక- విజయ్ దేవరకొండ. కాగా పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది రష్మిక. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ తాజాగా సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ ఒకటి వైరల్ గా మారింది. ‘ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం’ అంటూ ఓ చిన్న యానిమేషన్‌ వీడియో క్లిప్‌ షేర్‌ చేసింది రష్మిక.. అందులో రష్మిక, విజయ్‌తో పాటు ఓ పొద్దుతిరుగుడు పువ్వు ఉంది. రష్మిక టీ షర్ట్‌పై గుడ్డు ఫొటో కూడా ఉండడం విశేషం.

రష్మిక షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది రష్మిక తల్లి కాబోతోందా? గుడ్‌న్యూస్‌ ఎప్పుడు చెబుతారు మేడమ్? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి రష్మిక పెట్టిన ఈ పోస్టుకు అర్థం తెలియాలంటే ఆమెనే స్పందించాలి.

ఇవి కూడా చదవండి

రష్మిక షేర్ చేసిన వీడియో ఇదే..

ఇక సినిమాల విషయానికి వస్తే.. చివరిగా ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో నటించింది రష్మిక. ప్రస్తుతం ఆమె చేతిలో పలు తెలుగు, హిందీ సినిమాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండతో రణబాలి తో పాటు రెయిన్ బో, మైసా, కాక్ టెయిల్ 2 వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో రష్మిక నటించాల్సి ఉంది.

విజయ్ దేవరకొండతో రష్మిక..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us