AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: డీప్ ఫేక్ వీడియో పై స్పందించిన రష్మిక మందన్న.. ఇలాంటివి నార్మల్ కాదు అంటూ..

. ఎవరో ఓ యువతీ బోల్డ్ వీడియోకు రష్మిక ఫేస్ ను ఎడిట్ చేసి వీడియోను వైరల్ చేశారు. దాంతో ఈ డీప్ ఫేక్ వీడియో పై సర్వత్రా విమర్శలు వినిపించాయి. చాలా మంది సెలబ్రెటీలు ఈ విషయం పై స్పందించారు. కొంతమంది కేటుగాళ్లు ఇలా ఇండస్ట్రీ నటి నటుల పై ఫేక్ వీడియోలు చేసి వైరల్ చేస్తున్నారని అలంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేవలం రష్మిక మాత్రమే కాదు బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ తో..

Rashmika Mandanna: డీప్ ఫేక్ వీడియో పై స్పందించిన రష్మిక మందన్న.. ఇలాంటివి నార్మల్ కాదు అంటూ..
Rashmika
Rajeev Rayala
|

Updated on: Nov 27, 2023 | 6:28 PM

Share

ఈ మధ్యకాలంలో డీప్ ఫేక్ వీడియోస్ అంటూ కొన్ని వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఈ మధ్య బాగా వైరల్ అయ్యి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఎవరో ఓ యువతీ బోల్డ్ వీడియోకు రష్మిక ఫేస్ ను ఎడిట్ చేసి వీడియోను వైరల్ చేశారు. దాంతో ఈ డీప్ ఫేక్ వీడియో పై సర్వత్రా విమర్శలు వినిపించాయి. చాలా మంది సెలబ్రెటీలు ఈ విషయం పై స్పందించారు. కొంతమంది కేటుగాళ్లు ఇలా ఇండస్ట్రీ నటి నటుల పై ఫేక్ వీడియోలు చేసి వైరల్ చేస్తున్నారని అలంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేవలం రష్మిక మాత్రమే కాదు బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ తో పాటు పలువురి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా ఈ డీప్ ఫేక్ వీడియో పై రష్మిక మందన్న స్పందించింది. గతంలో సోషల్ మీడియా వేదికగా స్పందించిన రష్మిక తాజాగా మీడియా తో ఈ విషయం పై మాట్లాడింది. రష్మిక ప్రస్తుతం యానిమల్ అనే సినిమాలో నటిస్తుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో  తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు చిత్రయూనిట్.

ఈ క్రమంలో రష్మిక తన డీప్ ఫేక్ వీడియో గురించి మాట్లాడింది. ఇది అందరికి జరుగుతుంది. మాకు ముందుగా అమితాబ్ బచ్చన్ సపోర్ట్ చేశారు. ఆతర్వాత అందరు సపోర్ట్ చేశారు. మొదటి చూసినపుడు బాధ కలిగింది. కానీ ఇది నార్మల్ అయిపొయింది.. మొదట్లో భయం వేసింది .. కానీ చూసి చూసి మేము ఏం చేయగలం అని అనుకున్నా.. పట్టించుకోకూడదు అని అనుకున్నా.. కానీ అందరు ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తుంటే చూసి ఓకే ఇది నార్మల్ విషయం కాదు రియాక్ట్ అవ్వాలి అని అనుకున్నా అని తెలిపింది. దాంతో ఇప్పుడు ఇలాంటి వాటి పై చర్యలు తీసుకుంటున్నారు. దాంతో నేను అందరు అమ్మాయిలకు చెప్పాలనుకుంటున్నా.. ఇలాంటివి నార్మల్ కాదు. మీకు జరిగినప్పుడు సైలెంట్ గా ఉండకండి. రియాక్ట్ అవ్వండి .. జనాలు సపోర్ట్ చేస్తారు. మనం ఓ మంచి దేశంలో ఉన్నాం అని తెలిపింది రష్మిక.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.