Rashmika Mandanna: జపాన్‌లో నేషనల్ క్రష్.. అందుకోసమే అంటున్న ఫ్యాన్స్.. కానీ కారణం ఇదేనట
ఈ చిన్నది ఇప్పడు జపాన్‌లో ఉంది. దాంతో ఈ ముద్దుగుమ్మ అక్కడ ఏం చేస్తుంది ఏదైనా వెకేషన్ కు వెళ్లిందా లేక సినిమా షూటింగ్ కు వెళ్లిందా అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే 'పుష్ప 2' మూవీని జపాన్‌లో చిత్రీకరించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అందుకే రష్మిక ముందుగా జపాన్ వెళ్లి ఉండొచ్చని అభిమానులు అనుమానిస్తున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ రావడంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ పెరిగిపోయాయి. దాంతో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుంది. అయితే ఈ చిన్నది ఇప్పడు జపాన్‌లో ఉంది. దాంతో ఈ ముద్దుగుమ్మ అక్కడ ఏం చేస్తుంది ఏదైనా వెకేషన్ కు వెళ్లిందా లేక సినిమా షూటింగ్ కు వెళ్లిందా అని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ‘పుష్ప 2′ మూవీని జపాన్‌లో చిత్రీకరించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అందుకే రష్మిక ముందుగా జపాన్ వెళ్లి ఉండొచ్చని అభిమానులు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక రకరకాల ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాగే తాను జపాన్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.
పుష్ప’ సినిమా సూపర్ హిట్ కావడంతో దర్శకుడు సుకుమార్ రెండో భాగం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. దీనికి తోడు మూడో భాగం కూడా వస్తుందని ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హింట్ ఇచ్చాడు. దాంతో పుష్ప 3 పై కూడా రూమర్స్ మొదలయ్యాయి. ఇక పుష్ప 2 లో జపాన్ కు సంబందించిన కథ కూడా ఉంటుందట. అందుకే రష్మిక ‘పుష్ప 2’ షూటింగ్ కోసం జపాన్ వెళ్లిందని అంటున్నారు. అసలు విషయం ఏంటంటే..
రష్మిక మందన్నకు అనిమే సినిమాలంటే చాలా ఆసక్తి. ఇప్పుడు జపాన్‌లో జరుగుతున్న ‘అనిమే అవార్డు’ కార్యక్రమం కోసం అక్కడికి వెళ్ళింది. ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి నటీనటులు, గాయకులు తరలివచ్చారు. ఈ అవార్డు కార్యక్రమానికి రష్మిక మందన్నను కూడా ఆహ్వానించడం విశేషం. రష్మిక మందన్న ‘పుష్ప 2’తో పాటు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉంది. కొత్త చిత్రం ‘రెయిన్ బో’తో పాటు, ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ రష్మిక హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. అలాగే మరికొన్ని చిత్రాల్లో రష్మిక మందన్న నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మకు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు కూడా భారీగానే ఉన్నారు.
రష్మిక మందన్న ఇన్ స్టా గ్రామ్
View this post on Instagram
రష్మిక మందన్న ఇన్ స్టా గ్రామ్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.