Rashmika Mandanna: బాలీవుడ్‌ హీరోతో శ్రీవల్లి స్టెప్పులు.. సామి నా సామి అంటూ అదరగొట్టిన రష్మిక.. వీడియో వైరల్

Rashmika Mandanna- Govinda: కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న క్రేజ్‌ ప్రస్తుతం మాములుగా లేదు. పుష్ప సినిమాతో నేషనల్‌ వైడ్‌గా పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ హిందీలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది.

Rashmika Mandanna: బాలీవుడ్‌ హీరోతో శ్రీవల్లి స్టెప్పులు.. సామి నా సామి అంటూ అదరగొట్టిన రష్మిక.. వీడియో వైరల్
Rashmika Mandanna, Govinda

Updated on: Sep 25, 2022 | 7:12 AM

Rashmika Mandanna- Govinda: కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న క్రేజ్‌ ప్రస్తుతం మాములుగా లేదు. పుష్ప సినిమాతో నేషనల్‌ వైడ్‌గా పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ హిందీలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan)తో ఆమె కలిసి నటించిన గుడ్‌బై అక్టోబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే హిందీలో ప్రసారమవుతోన్న ప్రముఖ రియాలిటీ షో సూపర్‌ మామ్స్‌-3 గ్రాండ్‌ ఫినాలేలో కనిపించనుందీ అందాల తార. తాజాగా దీనికి ఎపిసోడ్‌ ప్రోమోను విడుదల చేసింది జీటీవీ. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందతో కలిసి కాలు కదిపింది రష్మిక. పుష్ప సినిమాలో సూపర్‌ హిట్ సాంగ్‌’ రా రా సామీ బంగారు సామీ’ పాటకు హుషారుగా డ్యాన్స్‌ చేస్తూ అందరినీ ఉర్రూతలూగించింది. ఆమె స్టెప్పులకు షో న్యాయనిర్ణేతలు, ఆడియెన్స్‌ ఫిదా అయ్యారు. చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపారు.

కాగా రష్మిక- గోవిందాల డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా సూపర్‌మామ్స్‌-3 గ్రాండ్‌ ఫినాలే ఫుల్‌ ఎపిసోడ్‌ ఆదివారం రాత్రి ప్రసారం కానుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల సీతారామం సినిమాలో అఫ్రీన్‌ పాత్రలో అదరగొట్టింది రష్మిక. త్వరలోనే బిగ్‌ బీ కలిసి గుడ్‌ బై చెప్పేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అలాగే ప్రస్తుతం తెలుగులో పుష్ప2తో పాటు, విజయ్‌ దళపతితో కలసి వారసుడు చిత్రాల్లో నటిస్తోంది. ఇక బాలీవుడ్‌లో మిషన్‌ మజ్నూ, యానిమల్‌ చిత్రాలతో బీటౌన్‌ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..