Rashmika Mandanna: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న నేషనల్ క్రష్.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్

|

Apr 22, 2022 | 10:46 AM

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవ్వడం అంత సులభమేమి కాదు.. తక్కువ టైంలోనే స్టార్ డమ్ రావడం అంటే నిజంగా అదృష్టమనే చెప్పాలి..

Rashmika Mandanna: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న నేషనల్ క్రష్.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్
Rashmika
Follow us on

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవ్వడం అంత సులభమేమి కాదు.. తక్కువ టైంలోనే స్టార్ డమ్ రావడం అంటే నిజంగా అదృష్టమనే చెప్పాలి.. ఇప్పుడు అదే అదృష్టంతో టాలీవుడ్ లో దూసుకుపోతుంది రష్మిక మందన్న(Rashmika Mandanna). ఛలో సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ చిన్నది తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకుంది. మీడియం రేంజ్ హీరోల సరసన నటిస్తున్న సమయంలోనే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. తన నటనతో అందంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీకి వెంటనే సుకుమార్ పిలిచి పుష్ప సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. పాన్ ఇండియా మూవీ పుష్ప భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ అమ్మడు క్రేజ్ మరింత పెరిగింది.  టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతూనే పుట్టినిల్లు కన్నడ లోనూ నటిస్తుంది. అలాగే ఈ మధ్య బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ఇక కోలీవుడ్ లో ఇప్పటికే ఒక సినిమా చేసిన ఈ భామ ఇప్పుడు ఏకంగా దళపతి విజయ్ తో జతకట్టడానికి రెడీ అయ్యింది. ఇలా జోరుమీదున్న నేషనల్ క్రష్ కు ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ తలుపు తట్టిందని తెలుస్తోంది. రష్మిక త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటించనుందట. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ముందుగా బాలీవుడ్ భామ అలియా భట్‌ను అనుకున్నారు. కానీ ఆ అమ్మడి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇప్పుడు అలియా ప్లేస్ లో రష్మికకు అవకాశం దక్కిందని తెలుస్తోంది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న తారక్. తన నెక్స్ట్ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పుడు తారక్ కు జోడీగా రష్మిక నటిస్తుందన్న వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

KGF 2: జక్కన్న ఆర్ఆర్ఆర్ టార్గెట్‏ను చేసిన కేజీఎఫ్.. ఎట్టకేలకు రికార్డ్ క్రాస్ చేసిందిగా..

KGF Chapter 2: కేజీఎఫ్ రియల్ రాఖీభాయ్ ఎవరో తెలుసా ?.. కోలార్ మైన్స్ హీరో ఇతడే..