Rashmika Mandanna: మేనేజర్ మోసం చేశాడన్న వార్తలపై స్పందించిన రష్మిక.. ప్రెస్ నోట్ రిలీజ్..
ఆమె కెరీర్ ప్రారంభం నుంచి వెన్నంటి ఉంటూ ఎంతో నమ్మకంగా పనిచేసిన మేనేజర్ రష్మిక వద్ద నుంచి వెళ్లిపోయాడట. అంతేకాదు.. ఆమె వద్ద నుంచి రూ. 80 లక్షలు మోసం చేయడంతో.. రష్మిక అతడిని పనిలో నుంచి తొలగించిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు స్పందించని రష్మిక తాజాగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. రష్మిక, ఆమె మేనేజర్ ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయారని.. అందుకు ఎలాంటి గొడవలు జరగలేదని చెప్పుకొచ్చింది.

దక్షిణాది చిత్రపరిశ్రమలో తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. తెలుగు, తమిళం, హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా రష్మిక వ్యక్తిగత జీవితంకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఆమె కెరీర్ ప్రారంభం నుంచి వెన్నంటి ఉంటూ ఎంతో నమ్మకంగా పనిచేసిన మేనేజర్ రష్మిక వద్ద నుంచి వెళ్లిపోయాడట. అంతేకాదు.. ఆమె వద్ద నుంచి రూ. 80 లక్షలు మోసం చేయడంతో.. రష్మిక అతడిని పనిలో నుంచి తొలగించిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు స్పందించని రష్మిక తాజాగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. రష్మిక, ఆమె మేనేజర్ ఇద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయారని.. అందుకు ఎలాంటి గొడవలు జరగలేదని చెప్పుకొచ్చింది.
“ఆరోగ్యకర వాతావరణంలో ఇద్దరం కలిసి పనిచేశాం. పరస్పర ఒప్పందంతో విడిగా కెరీర్ మరింత ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. ప్రొఫెషనల్ గా ఉండేవాళ్ల కాబట్టి అలాగే కలిసి వర్క్ చేశాం. ఇప్పుడు అంతే హుందాగా విడిగా పనిచేయాలని అనుకుంటున్నాం” అంటూ రష్మిక పేర్కొంది. దీంతో రష్మిక మేనేజర్ ఆమెను మోసం చేశాడన్న వార్తలకు చెక్ పడింది. ప్రస్తుతం ఈ ప్రెస్ నోట్ నెట్టింట వైరలవుతుంది.





Rashmika
ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే యానిమల్ చిత్రీకరణలో తన పార్ట్ కంప్లీట్ చేసుకుంది ఈ బ్యూటీ. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న పుష్ప 2లోనూ నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఇవే కాకుండా.. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని లేడీ ఓరియెంటెడ్ చిత్రంలోనూ నటిస్తుంది.




