AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika-Alia: డబుల్‌ బొనాంజా.. నాటు నాటు సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసిన రష్మిక, అలియా భట్‌.. వైరల్‌ వీడియో

నాటు నాటు ఫీవర్‌ ఇప్పట్లో తగ్గేలా లేదు. సందర్భమేదైనా ఈ సాంగ్‌కు కాలు కదిపేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆస్కార్‌ పురస్కారం గెల్చుకున్న తర్వాత ఈ సాంగ్‌ క్రేజ్‌ నెక్ట్స్‌ లెవెల్‌కి వెళ్లిపోయింది. ఇటీవల ఐపీఎల్‌ ప్రారంభోత్సవంలో కూడా రష్మిక నాటునాటు పాటకు అదిరిపోయే స్టెప్పులేసి అందరినీ ...

Rashmika-Alia: డబుల్‌ బొనాంజా.. నాటు నాటు సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసిన రష్మిక, అలియా భట్‌.. వైరల్‌ వీడియో
Rashmika Mandanna, Alia Bhatt
Basha Shek
|

Updated on: Apr 03, 2023 | 5:55 AM

Share

నాటు నాటు ఫీవర్‌ ఇప్పట్లో తగ్గేలా లేదు. సందర్భమేదైనా ఈ సాంగ్‌కు కాలు కదిపేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆస్కార్‌ పురస్కారం గెల్చుకున్న తర్వాత ఈ సాంగ్‌ క్రేజ్‌ నెక్ట్స్‌ లెవెల్‌కి వెళ్లిపోయింది. ఇటీవల ఐపీఎల్‌ ప్రారంభోత్సవంలో కూడా రష్మిక నాటునాటు పాటకు అదిరిపోయే స్టెప్పులేసి అందరినీ అలరించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇదే పాటకు మరోసారి డ్యాన్స్‌ చేసింది. ఈసారి ఆర్‌ఆర్‌ఆర్‌ భామ అలియాభట్‌ కూడా రష్మికకు జత కలిసింది. ఇలా ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకేసారి నాటునాటు స్టెప్పులేయడంతో వేదిక హోరెత్తిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే.. అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ సతీమణి డ్రీమ్‌ ప్రాజెక్టు నీతా ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు సినిమా సెలబ్రిటీలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌ స్టార్స్‌ సందడి చేయడంతో NMAAC ఈవెంట్‌ కలర్‌ఫుల్‌గా సాగింది. ఈ సందర్భంగా సినిమా తారలు వారికి ఇష్టమైన పాటలకు స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నారు. ఇందులో భాగంగా వరుణ్ ధావన్, షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, ఆలియా భట్, రష్మిక మందన్న సూపర్‌హిట్‌ పాటలకు డ్యాన్సులు చేసి ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించారు.

ఇదే వేదికపై అలియాభట్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక నాటు నాటు (హిందీ వెర్షన్‌)కు డ్యాన్స్‌ చేశారు. ముందు చెప్పుల‌తోనే స్టేజ్ ఎక్కేసిన ఆలియా చెప్పుల‌ను తీసేసి ర‌ష్మికతో క‌లిసి డాన్స్ చేసింది.దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.ఇక రణవీర్ సింగ్ సైతం ప్రియాంక చోప్రాతో కలిసి కాలు కదిపారు. వరుణ్ ధావన్ డ్యాన్స్ చేస్తూ హాలీవుడ్‌ బ్యూటీ జిగి హడిద్‌ను చేతులపై ఎ‍త్తుకుని సందడి చేశారు. ఇక బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్ ఇదే స్టేజ్‌పై తన లేటెస్ట్‌ మూవీ పఠాన్ టైటిల్ ట్రాక్‌ కు డ్యాన్స్‌ చేసి అలరించారు. ఇక, ఈ వేడుకల్లో సీనియర్‌ నటి రేఖ, బాలీవుడ్‌ స్టార్‌హీరో సల్మాన్‌ఖాన్‌, శ్రద్ధాకపూర్‌, హృతిక్‌ రోషన్‌, నటి సబా అజాద్‌, కాజోల్‌, కృతిసనన్‌, జాకీ ష్రాఫ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా భారతీయ కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నీతా అంబానీ ఈ కల్చరల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ముంబయిలోని జియో వరల్డ్‌ సెంటర్‌లో ఈ కల్చరల్‌ సెంటర్‌ ఏర్పాటైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు