AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramya Krishna : ఆ హీరోతో నటించాలంటే భయం.. రమ్యకృష్ణ కామెంట్స్.. ఇంతకీ ఎవరంటే..

అప్పట్లో తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో రమ్యకృష్ణ ఒకరు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే నెగిటివ్ షేడ్స్ ఉన్న నీలాంబరి పాత్రలో నటించి ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తుంది. అయితే గతంలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తనకు ఓ స్టార్ హీరోతో నటించాలంటే భయమని చెప్పింది.

Ramya Krishna : ఆ హీరోతో నటించాలంటే భయం.. రమ్యకృష్ణ కామెంట్స్.. ఇంతకీ ఎవరంటే..
Ramyakrishna
Rajitha Chanti
|

Updated on: Nov 30, 2025 | 1:01 PM

Share

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, రజనికాంత్ వంటి స్టార్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించింది. అప్పట్లో కథానాయికగా చక్రం తిప్పిన ఆమె.. ఇప్పుడు సహయ నటిగా రాణిస్తుంది. దశాబ్దాలుగా సినీరంగంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే నెగిటివ్ షేడ్స్ ఉన్న నీలాంభరి పాత్రలో అదరగొట్టేసింది. అప్పట్లో ఓ హీరోయిన్ విలన్ గా నటించడమంటే సాహసమనే చెప్పాలి. కానీ నరసింహ సినిమాతో రమ్యకృష్ణ గ్రాఫ్ మరింత పెరిగింది. నీలాంబరి తర్వాత ఆ స్థాయిలో పాపులర్ అయిన పాత్ర శివగామి. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. పవర్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ.. ఓ హీరోతో నటించాలంటే భయమని అంటోంది.

ఇవి కూడా చదవండి :  Hema Chandra: శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్.. హేమచంద్ర రియాక్షన్ ఇదే..

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్యకృష్ణ మాట్లాడుతూ.. తాను ఓ స్టార్ హీరోతో నటించేందుకు చాలా భయపడ్డానని తెలిపింది. “నేను ఎంతోమంది హీరోలతో కలిసి నటించాను. కానీ సూపర్ స్టార్ కమల్ హాసన్ తో నటించాలంటే మాత్రం చాలా భయపడ్డాను. అంతేకాదు.. ఆయన ముందు డైలాగ్ చెప్పాలంటే కూడా వణుకు వస్తుంది ” అని అన్నారు. ప్రస్తుతం రమ్యకృష్ణ చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ గా మారాయి.

పంచతంత్రం సినిమాలో కమల్ తోనే తన ఫస్ట్ షార్ట్ అని… అందులో మ్యాగీ పాత్రలో నటించినట్లు గుర్తుచేసుకుంది. ఈ సినిమాలో తన పాత్రకు ప్రత్యేక ఆకర్షణ ఉండాలని కమల్ చెప్పారని.. తొలిసారి ఆయనతో కలిసి నటించడానికి చాలా భయపడ్డానని అన్నారు. ఆ తర్వాత అంతా సెట్ అయిందని అన్నారు.

ఇవి కూడా చదవండి : Actress : 50 సినిమాల్లో హీరోయిన్.. ఒక్కరోజులోనే కెరీర్ క్లోజ్.. అసలేం జరిగిందంటే..