Ramoji Rao: అక్షర సూరీడికి అంతిమ వీడ్కోలు.. ఫిల్మ్ సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు పూర్తి..

ఈనాడు గ్రూపు ఛైర్మన్ రామోజీ రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అక్షర యోధుడి అంతిమ సంస్కరాలు పూర్తిచేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసం నుంచి స్మృతివనం వరకు అంతిమయాత్ర కొనసాగింది.

Ramoji Rao: అక్షర సూరీడికి అంతిమ వీడ్కోలు.. ఫిల్మ్ సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు పూర్తి..
Ramoji Rao
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 09, 2024 | 11:41 AM

ఈనాడు గ్రూపు ఛైర్మన్ రామోజీ రావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో అక్షర యోధుడి అంతిమ సంస్కరాలు పూర్తిచేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసం నుంచి స్మృతివనం వరకు అంతిమయాత్ర కొనసాగింది. రామోజీ రావుకు కడసారి వీడ్కోలు పలికారు కుటుంబసభ్యులు. స్మృతివనం వద్ద రామోజీ రావు పార్థీవదేహానికి నివాళులర్పించి పాడె మోశారు తెదేపా అధినేత చంద్రబాబు. రామోజీరావు అంతిమ సంస్కారాలను కుమారుడు కిరణ్ నిర్వహించారు. అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, సినీ ప్రముఖులు, రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రామోజీ రావు అంతిమ సంస్కారాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి.హనుమంతరావు, సుజనా చౌదరి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.