Ram Pothineni: క్రేజీ కాంబో.. ఆ స్టార్ డైరెక్టర్‌తో ఉస్తాద్ హీరో సినిమా..

|

Sep 15, 2022 | 5:51 PM

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హిట్టుకొట్టి చాలా రోజులైంది. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మరో హిట్ అందుకోలేక పోయాడు రామ్.

Ram Pothineni: క్రేజీ కాంబో.. ఆ స్టార్ డైరెక్టర్‌తో ఉస్తాద్ హీరో సినిమా..
Ram Pothineni
Follow us on

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni)హిట్టుకొట్టి చాలా రోజులైంది. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మరో హిట్ అందుకోలేక పోయాడు రామ్. ఇస్మార్ట్ ముందు కూడా వరుస ఫ్లాప్ లతో సతమతం అయ్యాడు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అప్పటివరకు లవర్ బాయ్ గా ఉన్న రామ్ ను ఈ సినిమాలో ఊర మాస్ గా చూపించాడు పూరి. ఇక ఈ సినిమా హిట్ తర్వాత రెడ్ అనే సినిమా చేశాడు. తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అలాగే రీసెంట్ గా వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ కుర్ర హీరో. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. దాంతో ఇప్పుడు రామ్ ఎవరితో సినిమా చేయనున్నదన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే రామ్ ఇప్పుడు ఓ స్టార్ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ఇండస్ట్రీలో మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రామ్ పోతినేని సినిమా చేయనున్నాడు. చెలి సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టిన గౌతమ్ మీనన్ ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి ఆకట్టుకున్నారు. అలాగే నటుడుగానూ రాణిస్తున్నారు గౌతమ్ మీనన్. రీసెంట్ గా వచ్చిన సీతారామం సినిమాలో కీలక పాత్రలో నటించారు గౌతమ్ మీనన్. ఇక ఇప్పుడు రామ్ పోతినేనితో సినిమా చేయనున్నారు. గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘వెందు తనిధాతు కాడు’. శింబు హీరోగా నటించిన ఈ మూవీని తెలుగులో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ పేరుతో రిలీజ్ అవుతోంది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రామ్ తో సినిమా చేయబోతున్నానంటూ ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ ని స్రవంతీ మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ నిర్మించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి