Ram Pothineni: భాగ్యశ్రీ బోర్సేతో ప్రేమాయణం.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన రామ్ పోతినేని..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇప్పుడు సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్నాడు. దేవదాసు సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన.. ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించారు. చాలా కాలంగా ఈ హీరో ఖాతాలో ఒక్క హిట్టు పడలేదు. దీంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు.

Ram Pothineni: భాగ్యశ్రీ బోర్సేతో ప్రేమాయణం.. రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన రామ్ పోతినేని..
Ram Pothineni

Updated on: Nov 25, 2025 | 7:11 PM

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి చెప్పక్కర్లేదు. చిన్న వయసులోనే హీరోగా తెరంగేట్రం చేసిన రామ్.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఇందులో ఓ స్టార్ హీరోకు వీరాభిమానిగా కనిపించనున్నారు రామ్. డైరెక్టర్ పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. ఇదివరకు విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. నవంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు రామ్.

ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..

కొన్నాళ్లుగా రామ్ వ్యక్తిగత విషయాల గురించి నెట్టింట రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో రామ్ ప్రేమలో ఉన్నారనే టాక్ నడుస్తుంది. మూవీ షూటింగ్ ప్రారంభమైన నాటి నుంచి ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ రూమర్స్ పై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు రామ్. “ఈ సినిమా కోసం నేను ఒక ప్రేమ గీతం రాశాను. అప్పటినుంచే ఈ రూమర్స్ మొదలయ్యాయి. మనసులో ేమీ లేకపోతే అంత గొప్పగా పాట ఎలా రాయగలరు అని అందరూ అనుకున్నారు. కానీ నేను ఈ సినిమాలోని హీరోహీరోయిన్ పాత్రలను ఊహించుకుని ఆ లిరిక్స్ రాశాను.ఈ పాట రాసినప్పటికీ అసలు హీరోయిన్ ఎంపిక జరగలేదు” అని అన్నారు.

ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?

దీంతో రామ్, భాగ్య శ్రీ బోర్సే లవ్ రూమర్స్ పై క్లారిటీ వచ్చేసింది. రామ్ చివరిసారిగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలుకా చిత్రంతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మరో రెండు రోజుల్లో అడియన్స్ ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..

ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..

Follow Us