ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni)నటిస్తున్న లేటెస్ట్ మూవీ వారియర్. తమిళ దర్శకుడు లింగు స్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ది వారియర్(The Warriorr) అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. రామ్ మొదటి సారి పోలీస్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలు అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గ నటిస్తుంది. పవర్ ఫుల్ విలన్ పాత్రలో విలక్షణ నటుడు ఆదిపినిశెట్టి కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ , బుల్లెట్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా కట్టుకుంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో రామ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమానుంచి టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ లో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అలాగే ఆది విలనిజం మరోసారి మెప్పించడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగ కృతి శెట్టి మరోసారి తన అందంతో కట్టిపడేయడం ఖాయంగా కనిపిస్తుంది. టీజర్ చూస్తుంటే రామ్ ఈ సారి సాలిడ్ హిట్ కొట్టడం కన్ఫామ్ అనిపిస్తుంది. ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఆ అంచనాలను అందుకునేలా లింగుస్వామి సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది వారియర్.
మరిన్ని ఇక్కడ చదవండి :