Ram Pothineni: ‘ది వారియర్’ గా రానున్న రామ్ పోతినేని.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్..
ఎనర్జీటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఎనర్జీటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషలలో తెరకెక్కిస్తున్నారు. RAPO 19 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్.
కాసేపటి క్రితం ఈ సినిమా టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ది వారియర్ అంటూ మూవీ టైటిల్ ప్రకటిస్తూ.. రామ్ పోతినేని పోలీస్ పాత్రలో ఉన్న లుక్ రివీల్ చేశారు. మొదటి సారి ఈ సినిమాలో రామ్ పోతినేని పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా విడుదలైన పోస్టర్ లో రామ్ తన పోలీస్ బృందంతో కలిసి ఒక ముఖ్యమైన మిషన్ లో పోలీసు అధికారిగా కనిపించాడు. పూర్తిగా యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
??? ???????? is Here and the War Begins!?#TheWarriorr ???@ramsayz @AadhiOfficial @dirlingusamy @iamkrithishetty @SS_Screens @srinivasaaoffl @iAksharaGowda @ThisIsDSP @sujithvasudev @anbariv @adityamusic @masterpieceoffl #RAPO19FirstLook pic.twitter.com/vgLDt5EiIX
— Srinivasaa Silver Screen (@SS_Screens) January 17, 2022
Coronavirus: కరోనా బారిన పడిన ‘ఖిలాడీ’ బ్యూటీ.. రెండు డోసులు టీకా తీసుకున్నా వదలని వైరస్..
Ashok Galla’s HERO: హీరో చిత్రయూనిట్ థాంక్యూ మీట్.. మంచి టాక్ ను సొంతం చేసుకున్న అశోక్ గల్లా మూవీ..
Bangarraju: సినిమా చూసి ఇంటికి రాగానే అమల ఏడ్చేసింది.. ఆసక్తికర విషయం చెప్పిన నాగార్జున




