Teaser: ఆ అమ్మాయి గురించి ఇప్పుడు చెప్పలేక పోతున్నామన్న చిత్ర యూనిట్.. కారణం అదేనట..
Teaser: సుధీర్ బాబు హీరోగా ఇందగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”. ఇప్పటికే సమ్మోహనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వీరిద్దరూ మరోసారి మంచి ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు...

Teaser: సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”. ఇప్పటికే సమ్మోహనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వీరిద్దరూ మరోసారి మంచి ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబుకు జోడిగా అందాల తార కృతి శెట్టి నటిస్తుండడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్, ఫస్ట్‌లుక్ చిత్రంపై క్యూరియాసిటీని పెంచేసింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా విడుదల కోసం ఎదురు చూస్తోంది.

ఇదిలా ఉంటే సోమవారం (నేడు) ఈ సినిమా టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వల్ల టీజర్‌ను విడుదల చేయలేకపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వేదికగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సాంకేతిక కారణాల వల్ల మేము ఇచ్చిన హామీ మేరకు ఈరోజు టీజర్‌ను విడుదల చేయలేకపోయాము.
కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తాము. మీ ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు అంటూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ఇదిలా ఉంటే బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Maharastra: ఈ పక్షికి సిగ్గెక్కువ.. నేలపై వాలదు.. లుక్ చూస్తే పావురం..లక్షణాలు మాత్రం చిలకవే..
Telangana High Court: రోజుకి లక్ష RT PCR పరీక్షలు చేయాలి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు..
Andhra Pradesh: సంక్రాంతికి పప్పుల చిట్టీల పేరుతో కుచ్చుటోపీ.. లబోదిబోమంటున్న బాధితులు




