Andhra Pradesh: సంక్రాంతికి పప్పుల చిట్టీల పేరుతో కుచ్చుటోపీ.. లబోదిబోమంటున్న బాధితులు
Andhra Pradesh:మోసం చేయడానికి డబ్బులు, బంగారం, కారు వంటి విలువైన వస్తువుల పేరుతోనే కాదు.. వెరైటీగా పప్పుల పేరుతో కూడా ప్రజలను మోసం చేయవచ్చు నిరూపించారు కొందరు..
Andhra Pradesh:మోసం చేయడానికి డబ్బులు, బంగారం, కారు వంటి విలువైన వస్తువుల పేరుతోనే కాదు.. వెరైటీగా పప్పుల పేరుతో కూడా ప్రజలను మోసం చేయవచ్చు నిరూపించారు కొందరు. సంక్రాంతి పండగకు పప్పులు ఇస్తామని.. చీటిల పేరుతో చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. ఈ హైటెక్ మోసం విశాఖపట్నంలో వెలుగులోకి వచ్చింది. –
విశాఖలో పప్పుల పేరుతో జరిగిన చీటీల మోసం వెలుగులోకి వచ్చింది. సంక్రాంతి పండగకు పప్పు దినుసుల కావాలంటే.. నెలకు రూ. 200 నుంచి రూ.300లు చెల్లిస్తే చాలని తాము ఇస్తామని ఇద్దరు వ్యక్తులు ప్రజలకు ఎర వేశారు. వేమాలమ్మ పేరుతో సంక్రాంతి పప్పు చిట్టీలు వసూలు చేశారు. పలువురు పప్పుల కోసం చిటీలను వేశారు. నిందితులు కోట్లాది రూపాయలు డబ్బులు వసూలు చేసుకున్న తర్వాత బోర్డు తిప్పేశారు. దీంతో బాధితులు బుచ్చయ్యపేట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల ఆస్తులు, పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు. చిట్టిల పేరుతో మోసం చేసిన నిందుతులు ఏలియాబాబు అలియాస్ రవి, రామారెడ్డిలుగా గుర్తించారు. పరారిలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలించారు. తమకు న్యాయం చేయమంటూ బాధితులు డిమాండ్ చేశారు.
Also Read: