AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ala Vaikuntapurramuloo: అల్లు అర్జున్ అభిమానులకు గుడ్‏న్యూస్.. థియేటర్లలోకి అల వైకుంఠపురంలో..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నారు. ఇటీవల ఆయన నటించిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.

Ala Vaikuntapurramuloo: అల్లు అర్జున్ అభిమానులకు గుడ్‏న్యూస్.. థియేటర్లలోకి అల వైకుంఠపురంలో..
Allu Arjun 1
Rajitha Chanti
|

Updated on: Jan 17, 2022 | 12:38 PM

Share

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నారు. ఇటీవల ఆయన నటించిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. విడుదలై నేటితో నెల రోజులు అవుతున్నా పుష్ప క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. దక్షిణాదిలోనే కాకుండా.. ఉత్తరాదిలోనూ 80 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్స్ సృష్టిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో బన్నీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఓ వైపు పుష్ప మేనియా కొనసాగుతుండగానే బన్నీ ఫ్యాన్స్‏కు మరో ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు మేకర్స్.

తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్.. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురం సినిమాను నార్త్ థియేటర్లలో విడుదల చేయడానికి సిద్దమవుతున్నారట మేకర్స్. 2020లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి వసూలు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ రీమేక్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. అల వైకుంఠపురంలో రీమేక్ హక్కులను మినహాయించి మొత్తం హిందీ హక్కులను గోల్డ్ మైన్స్ టెలిఫిల్మ్స్ కు చెందిన మనీష్ షా సొంతం చేసుకున్నారు.

పుష్ప హిందీ వెర్షన్ రిలీజ్ చేసిన ఏఏ ఫిల్మ్స్, గోల్డ్ మైన్ టెలిఫిల్మ్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాయి. అల వైకుంఠపురంలో డబ్బింగ్ వెర్షన్ ను జనవరి 26న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో టబు, జయరామ్, రాహుల్ రామకృష్ణ, నివేదా పేతురాజ్, నవదీప్, సుశాంత్ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు.

Also Read: Pragathi: ‘ఉ అంటావా మావ’ అంటూ జిమ్ లో స్టెప్పులేసిన ప్రగతి.. నెట్టింట్లో వైరల్ గా మారిన డ్యాన్స్ వీడియో..

Coronavirus: కరోనా బారిన పడిన ‘ఖిలాడీ’ బ్యూటీ.. రెండు డోసులు టీకా తీసుకున్నా వదలని వైరస్..

Ashok Galla’s HERO: హీరో చిత్రయూనిట్ థాంక్యూ మీట్.. మంచి టాక్ ను సొంతం చేసుకున్న అశోక్ గల్లా మూవీ..

Bangarraju: సినిమా చూసి ఇంటికి రాగానే అమల ఏడ్చేసింది.. ఆసక్తికర విషయం చెప్పిన నాగార్జున

Follow Us
మాట్లాడటంలో ఇబ్బంది, చేతులు బలహీనంగా మారుతున్నాయా? అలసత్వం వద్దు
మాట్లాడటంలో ఇబ్బంది, చేతులు బలహీనంగా మారుతున్నాయా? అలసత్వం వద్దు
ఒక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టిన వైభవ్.. బుడ్డోడిని ఇలా చూస్తే..
ఒక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టిన వైభవ్.. బుడ్డోడిని ఇలా చూస్తే..
20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్
20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్
చికెన్ vs చేపలు.. వర్షాకాలంలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
చికెన్ vs చేపలు.. వర్షాకాలంలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
దిగ్గజ గాయని జానకమ్మ జీవితంలో ఇంత అందమైన ప్రేమకథ ఉందా?
దిగ్గజ గాయని జానకమ్మ జీవితంలో ఇంత అందమైన ప్రేమకథ ఉందా?
కరివేపాకు గుబురుగా పెరగడం లేదా? తోటమాలి చెప్పే 2 సూపర్‌ ట్రిక్స్‌
కరివేపాకు గుబురుగా పెరగడం లేదా? తోటమాలి చెప్పే 2 సూపర్‌ ట్రిక్స్‌
చిరాకు, నీరసం తగ్గి.. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..
చిరాకు, నీరసం తగ్గి.. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..
ఈ అట్టర్ ఫ్లాప్ టీంతో టీ20 ప్రపంచకప్ 2028కు వెళ్తారా..?
ఈ అట్టర్ ఫ్లాప్ టీంతో టీ20 ప్రపంచకప్ 2028కు వెళ్తారా..?
చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని అన్నం తినిపించా..
చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని అన్నం తినిపించా..
యువతలో గుండెపోటుకు అసలు కారణాలు ఏంటీ..? డాక్టర్లు చెప్పే నిజాలు..
యువతలో గుండెపోటుకు అసలు కారణాలు ఏంటీ..? డాక్టర్లు చెప్పే నిజాలు..