AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV-Apsara Rani: క్రాక్ సినిమా ఐటెం భామ ‘అప్సర రాణి’తో పబ్‌లో చిందులేసిన ఆర్జీవీ .. వీడియో వైరల్

RGV-Apsara Rani: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మ ఓ సంచలనం.. శివ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు సరికొత్త ఒరవడి నేర్పించాడు.. ఒక్క సినిమాతోనే సెన్సేషనల్ హిట్ ఇచ్చి చిత్ర పరిశ్రమని తనవైపుకు తిప్పుకున్న..

RGV-Apsara Rani: క్రాక్ సినిమా ఐటెం భామ 'అప్సర రాణి'తో పబ్‌లో చిందులేసిన ఆర్జీవీ .. వీడియో వైరల్
Rgv Apsara Rani
Surya Kala
|

Updated on: Sep 10, 2021 | 5:15 PM

Share

RGV-Apsara Rani: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మ ఓ సంచలనం.. శివ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు సరికొత్త ఒరవడి నేర్పించాడు.. ఒక్క సినిమాతోనే సెన్సేషనల్ హిట్ ఇచ్చి చిత్ర పరిశ్రమని తనవైపుకు తిప్పుకున్న రామ్ గోపాల్ వర్మ.. సోషల్ మీడియా వేదికగా కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం అలవాటు. ఎప్పుడు ఏదో ఒక అంశంపై వివాదాస్పద ట్వీట్లు చేయడం.. ట్రెండింగ్‌లో ఉండటం.. ఆర్జీవీకి వెన్నతో పెట్టిన విద్య. ఆర్జీవి మాట్లాడినా సంచలనమే… మాట్లడక పోయినా సంచలనమే. నిత్యం ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అంతా ‘నా ఇష్టం’ అంటూ ఎవరి మాటలను లెక్కచేయడు. వర్మ తాను తీసే సినిమాలతో కంటే.. తన నోటికి పని చెప్పి.. వివాదాస్పద కామెంట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు.

అయితే వర్మని ద్వేషించేవారు తిట్టుకునే వారు ఎంతమంది ఉన్నారో.. అతనిని అభిమానించేవారు కూడా అంతే మంది ఉన్నారు.  అయితే ఇప్పుడు వర్మ నోటి పని చెప్పడం మానేసి.. కొంతమంది గర్ల్స్ తో ఎంజాయ్ చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హల్ చల్ చేస్తున్నాడు.

గతంలో బిగ్ బాస్ బ్యూటీ అరియన తో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి రచ్చ  చేసిన ఆర్జీవీ ఇటీవల  బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి తో బోల్డ్ ఇంటర్వ్యూ  చేశాడు. తాజాగా ఇప్పుడు ఆ వంతు క్రాక్ సినిమా లో ఐటెం సాంగ్ చేసిన బ్యూటీ వంతు వచ్చింది. అయిదు ఈసారి ఇంటర్వ్యూ కాకుండా అప్సరా రాణి తో వర్మ డీజే సాంగ్ కు తన్మయత్వంలో మునిగిపోతూ ఎంజాయ్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చాడు.  హైదరాబాద్ లోని బ్రాడ్‌వే బ్రూవరీ పబ్ లో అప్సరా రాణి తో రామ్ గోపాల్ వర్మ స్టెప్పులు వేస్తూ తెగ ఎంజాయ్ చేశాడు. ఈ వీడియో ని ఆర్జీవీ.. మీ అందరికీ చాలా సంతోషకరమైన , పవిత్రమైన రోజు కావాలని కోరుకుంటున్నాను అంతేకాదు మీ అందరికీ టన్నుల కొద్దీ ఆనందం,  శ్రేయస్సు లభిస్తుందని ఆశిస్తున్నాను ..  అంటూ కామెంట్ జత చేసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఓ రేంజ్ లో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Also Read :  కాణిపాకంలోనే కాదు.. ఇక్కడ కూడా రోజు రోజుకీ పెరిగే ఏకశిలా గణపతి.. వెన్నతో చేసిన అలంకరణ చూడాల్సిందే అంటున్న భక్తులు

Celebrities-Vinayaka Chavithi: సినీ ప్రముఖుల ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్..