RGV – Perni Nani: ఆర్జీవీతో పేర్ని నాని భేటీ.. సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఉత్కంఠ..

Ram Gopal Varma - Minister Perni Nani: ఏపీలో సినిమా టికెట్ల వ్యవహరం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది . కొన్ని రోజుల నుంచి వరుస ట్విట్లతో

RGV - Perni Nani: ఆర్జీవీతో పేర్ని నాని భేటీ.. సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఉత్కంఠ..
Perni Nani Rgv

Updated on: Jan 10, 2022 | 3:58 PM

Ram Gopal Varma – Minister Perni Nani: ఏపీలో సినిమా టికెట్ల వ్యవహరం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది . కొన్ని రోజుల నుంచి వరుస ట్విట్లతో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. ఏపీ మంత్రులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న విషయం తెలిసింది. గత వారం నుంచి టికెట్ రేట్ల విషయంలో ప్రశ్నలు సంధించిన ఆర్జీవీ తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. అయితే.. ఈ భేటీ అటు సినిమా, ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటకు ఏపీ సచివాలయానికి చేరుకున్న ఆర్జీవీ.. మంత్రి పేర్ని నాని ఛాంబర్ కు వెళ్లి మాట్లాడుతున్నారు. దాదాపు గంట నుంచి కొనసాగుతున్న ఈ మీటింగ్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

టికెట్ల రేట్ల తగ్గింపు వల్ల, నిర్మాతలకు థియేటర్ యాజమాన్యాలకు నష్టం వాటిల్లుతుందని ట్విట్టర్ వేదికగా తాను వెల్లడించిన అంశాలపై రామ్ గోపాల్ వర్మ మరింత వివరణ ఇస్తున్నట్టు తెలుస్తోంది. కాగా.. ఈ సమావేశంలోనే ఆర్జీవీ, పేర్ని నాని కలిసి భోజనం చేయనున్నట్లు పేర్కొంటున్నారు. కాగా.. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కాగా.. ఈ భేటీలో హోమ్ సెక్రెటరీ విజయకుమార్, ఎఫ్డీసీ సెక్రెటరీ విజయకుమార్ పాల్గొన్నారు.

ఇదిలాఉంటే… భేటీకి ముందు రామ్ గోపాల్ వర్మ మీడియాతో మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీ తరపున కాకుండా తన సొంత అభిప్రాయం చెప్పడానికి ఏపీ వచ్చానన్నారు. అంతిమంగా ప్రభుత్వానిదే తుది నిర్ణయమని స్పష్టంచేశారు.

కాగా.. జగన్ సర్కార్ జీవో నెంబర్ 35 ప్రవేశపెట్టి సినిమా టికెట్ల ధరలను నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిర్ణయించిన ధరలకంటే.. ఎక్కువకు అమ్మకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. దీనిపై పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిదే.

Also Read:

Sarkaru Vaari Paata: మహేష్ సినిమాకు అనుకోని అడ్డంకులు.. సమ్మర్‌కు రిలీజ్ సాధ్యమేనా..?

Viral Video: పుష్ప మేనియా మాములుగా లేదుగా.. సామీ సామీ సాంగ్ ను ఇలా కూడా వాడేస్తున్నారు.. ఏకంగా గుడిలో..