Upasana Ram Charan: “ఈ ప్రయాణంలో నా బిడ్డ కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది”.. భావోద్వేగ పోస్ట్ చేసిన ఉపాసన..

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్.. నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అందుకున్నారు. ఈ వేడుకకు రాజమౌళి .. కీరవాణి.. రామ్ చరణ్.. ఎన్టీఆర్ కుటుంబసమేతంగా హాజరయ్యారు.

Upasana Ram Charan: ఈ ప్రయాణంలో నా బిడ్డ కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది.. భావోద్వేగ పోస్ట్ చేసిన ఉపాసన..
Ram Charan, Upasana
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 11, 2023 | 5:00 PM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ఇంకా ప్రభంజనం సృష్టిస్తోంది. రూ. 400 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం రూ. 1200పైగా వసూళ్లు చేసి రికార్డ్స్ క్రియేట్ చేసింది. కేవలం భారతీయులే కాకుండా.. విదేశీయులు సైతం ఈ చిత్రానికి ఫిదా అయ్యారు. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్.. నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి అందుకున్నారు. ఈ వేడుకకు రాజమౌళి .. కీరవాణి.. రామ్ చరణ్.. ఎన్టీఆర్ కుటుంబసమేతంగా హాజరయ్యారు. ఇందులో చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత సంప్రదాయ చీరకట్టులో ఈ వేడుకలలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ…భావోద్వేగ నోట్ పంచుకున్నారు.

“ఆర్ఆర్ఆర్ కుటుంబంలో భాగమైనందుకు చాలా గౌరవంగా ఉంది. భారతీయ సినిమాకు సగర్వంగా ప్రాతినిధ్యం వహిస్తూ.. గెలుపొందారు. ఈ ప్రయాణంలో నాతోపాటు.. నా బిడ్డ కూడా ఈ గౌరవం అనుభవించడం చాలా సంతోషంగా ఉంది. నేను చాలా భావోద్వాగానికి గురయ్యాను. ఉక్రెయిన్ షెడ్యూల్ షూటింగ్ సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న మేకర్స్ కృషికి ఇది గెలుపు. ఈ ప్రయాణంలో నన్ను భాగం చేసినందుకు మిస్టర్ సి.. రాజమౌళి గారికి ధన్యవాదాలు. ఉక్రెయిన్ లో షూటింగ్ నుంచి గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వరకు మీరు నాకు చాలా నేర్పించారు. ఆలోచన స్పష్టత.. కృష్ణి, పట్టుదల ప్రతిఫలాన్ని ఇస్తాయి” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఉపాసన చేసిన పోస్ట్ వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

గతేడాది డిసెంబర్‏లో రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు పది సంవత్సరాల తర్వాత వీరు తమ మొదటి బిడ్డకు ఆహ్వానం పలకబోతున్నారు. చరణ్, ఉపాసన మొదటి బిడ్డ కోసం ప్రేమతో ఎదురుచూస్తున్నామని చిరంజీవి దంపతులు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించని ఆ సూపర్ హిట్ సాంగ్..
గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించని ఆ సూపర్ హిట్ సాంగ్..
పని ఒత్తిడి తాళలేక భవనంపై నుంచి దూకి బ్యాంకు ఉద్యోగిని సూసైడ్‌!
పని ఒత్తిడి తాళలేక భవనంపై నుంచి దూకి బ్యాంకు ఉద్యోగిని సూసైడ్‌!
ఆలివ్‌ ఆకులతో ఆరోగ్యం.. తీవ్ర వ్యాధులు మాయం.. రోజువారీ ఇలా వాడితే
ఆలివ్‌ ఆకులతో ఆరోగ్యం.. తీవ్ర వ్యాధులు మాయం.. రోజువారీ ఇలా వాడితే
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్
పీజీ వైద్యసీట్ల ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల..KNRUHS
పీజీ వైద్యసీట్ల ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల..KNRUHS
ఎవడండీ వీడు.. విజయానికి 26 పరుగులు.. కట్‌చేస్తే..
ఎవడండీ వీడు.. విజయానికి 26 పరుగులు.. కట్‌చేస్తే..
జుట్టు రాలిపోవడానికి కారణాలు తెలుసా..? తప్పక తెలుసుకోవాల్సిందే.!
జుట్టు రాలిపోవడానికి కారణాలు తెలుసా..? తప్పక తెలుసుకోవాల్సిందే.!
అందంతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి..
అందంతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి..
ఈ ఏడాది ఇంటర్ 1st Year పబ్లిక్ పరీక్షలు యథాతథం..వచ్చే ఏడాది రద్దు
ఈ ఏడాది ఇంటర్ 1st Year పబ్లిక్ పరీక్షలు యథాతథం..వచ్చే ఏడాది రద్దు
శ్రీదేవితో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇండియన్ సూపర్ స్టార్
శ్రీదేవితో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇండియన్ సూపర్ స్టార్