AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఏపీలో బాలయ్య, చిరు సినిమాలకు టికెట్ల రేట్లు పెంపు.. ఎంతంటే..?

బాలయ్య, చిరు సినిమాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Tollywood: ఏపీలో బాలయ్య, చిరు సినిమాలకు టికెట్ల రేట్లు పెంపు.. ఎంతంటే..?
Balakrishna's 'Veera Simha Reddy' - Chiranjeevi's 'Waltair Veerayya'
Ram Naramaneni
|

Updated on: Jan 11, 2023 | 5:24 PM

Share

సంక్రాంతికి రిలీజ్ అవుతున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్‌ న్యూస్ చెప్పాయి. సినిమా టికెట్ రేట్ల పెంపునకు అనుమతిచ్చాయి. వీరసింహరెడ్డికి అన్ని క్లాస్‌లపై 20 రూపాయలు, వాల్తేరు వీరయ్యకు 25 రూపాయల పెంపునకు అవకాశమిచ్చాయి. సినిమాలు విడుదలైన మొదటి 10 రోజులు ధరల పెంపునకు ఏపీ సర్కార్ ఛాన్స్ ఇచ్చింది.

చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాల టికెట్‌ ధరలు ఫిక్స్ అయ్యాయి. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించింది. పండగ సందర్భంగా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ రిక్వెస్ట్‌పై టికెట్‌ ధరపై గరిష్ఠంగా 25 రూపాయలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీరసింహారెడ్డి సినిమా టికెట్‌ ధరను 20 రూపాయలు పెంచుకునేందుకు.. వాల్తేరు వీరయ్య టికెట్‌ ధర 25 రూపాయలకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల స్పెషల్‌ షోలకు తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. ఈ రెండు చిత్రాలకు ఆరో ఆటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు చిత్రాల రిలీజ్ రోజున ఉదయం 4 గంటల ఆటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి గురువారం, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య శుక్రవారం మూవీ విడుదల కానున్నాయి. ఈ చిత్రాలు విడుదల రోజున ఉదయం 4 గంటల షోకు తెలంగాణ సర్కార్ అనుమతి ఇచ్చింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..