Upasana: అయోధ్య రాముడి సేవలో ఉపాసన.. భక్తుల కోసం ఉచిత వైద్య సేవలు ప్రారంభం

|

Dec 15, 2024 | 2:28 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల ప్రస్తుతం ఆధ్యాత్మిక సేవలో బిజీగా గడుపుతోంది. తాజాగా ఆమె అయోధ్య రాముడిని దర్శించుకుంది. అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంది.

Upasana: అయోధ్య రాముడి సేవలో ఉపాసన.. భక్తుల కోసం ఉచిత వైద్య సేవలు ప్రారంభం
Ram Charan Wife Upasana
Follow us on

మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది. రాముడు కొలువైన అయోధ్యలో అపోలో అపోలో ఎమర్జన్సీ కేర్ సెంటర్ ను ప్రారంభించిందామె. ఈ కేర్ సెంటర్ ద్వారా అయోధ్య రామమందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు మెగా కోడలు తెలిపింది. తాజాగా అయోధ్య రాముడిని దర్శించుకున్న ఆమె అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అత్యవసర సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఉపాసన.. ‘ సనాతన ధర్మం గురించి మా తాత చాలా నేర్పించారు. అయోధ్యలో సేవ చేసే అవకాశం లభించడం మాకు గొప్ప ఆశీర్వాదం లాంటిది. తాతయ్య మాటల స్ఫూర్తితోనే అయోధ్య రామమందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాం. ఇప్పటికే తిరుమల, శ్రీశైలం, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లో అపోలో ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ద్వారా భక్తులకు ఉచిత సేవలు అందిస్తున్నాం. ఇప్పుడు రామ జన్మభూమిలో సేవ చేయడం అదృష్టం. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’ అని పేర్కొంది ఉపాసన.

ప్రస్తుతం మెగా కోడలు షేర్ చేసిన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఉపాసన చాలా మంచి పని చేస్తుందంటూ మెగా అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్‌ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి

అయోధ్య రామ మందిరం వద్ద ఉపాసన..

ఉపాసన కూతురు క్లింకార..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.