గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న చిత్రం ఆర్ సీ 16 (వర్కింగ్ టైటిల్). ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు తెరకెక్కిస్తోన్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దేవర తర్వాత జాన్వీకి ఇది తెలుగులో రెండో సినిమా. వీటితో పాటు మరికొన్ని తెలుగు సినిమాలకు సైన్ చేసేందుకు ఈ ముద్దుగుమ్మ రెడీ అవుతోందని సమాచారం. ఇక జాన్వీ ముంబైలో ఉంటున్నప్పటికీ దక్షిణాదితోనూ మంచి అనుబంధం ఉంది. వీలు దొరికనప్పుడల్లా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటుందీ అందాల తార. అంతే కాదు జాన్వీకి దక్షిణాది వంటకాలంటే బాగా ఇష్టం. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది.
ఇంతకు ఆ బహుమతెంటో తెలుసా? చిరంజీవి సతీమణి, ఉపాసన అలాగే తల్లి అంజనా దేవి కలిసి అత్తమ్మాస్ కిచెన్ పేరుతో ఇన్ స్టంట్ మిక్స్ లు రెడీ చేసి ఆన్ లైన్ లో విక్రయిస్తున్నారు. దూర ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఇంటిభోజనాన్ని మిస్ అవకూడదన్న ఆలోచనతోనే ఈ అత్తమ్మాస్ కిచెన్ పుట్టుకొచ్చింది. ఇందులో భాగంగా అప్పటికప్పుడు పెద్దగా శ్రమ పడకుండా ఈజీగా ఇంటి భోజనం తయారయ్యేలా ఇన్‌స్టంట్ మిక్స్‌లు రెడీ చేసి అమ్ముతున్నారు. ఎలాంటి కృత్రిమ ప్రిజర్వేటివ్స్ వాడకుండా వీటిని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది ఉపాసన. ఉప్మా, పులిహోర, రసం, పొంగల్.. ఇలా పలురకాల ఉత్పత్తులను వీరు విక్రయిస్తున్నారు.
ఈ క్రమంలోనే అత్తమ్మాస్ కిచెన్ నుంచి ఓ గిఫ్ట్ హ్యాంపర్‌ను జాన్వీకి ఇచ్చింది మెగా కోడలు ఉపాసన. అసలే దక్షిణాది వంటకాలంటే ఇష్టంగా తినే జాన్వీ ఉపాసన గిఫ్ట్ హ్యాంపర్ ను ఎంతో సంతోషంగా స్వీకరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
On the occasion of Athamma’s Birthday we are delighted to launch our entrepreneurial venture – Athamma’s Kitchen
Where taste meets tradition & culinary bonds are built over generations. Experience our ready mix – straight from our kitchen to yours.
https://t.co/WhQ2JmjsaG pic.twitter.com/5UgBGfUkMC— Upasana Konidela (@upasanakonidela) February 18, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.