Upasana Konidela: కొత్త ఎలక్ట్రిక్‌ కారు కొన్న మెగా కోడలు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు

Upasana Konidela: పలు సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకున్న ఉపాసన కొత్త కారును కొంది. ఆడి కంపెనీకి చెందిన ఆడి ఇ-ట్రాన్‌ (Audi e-tron)ను ఎలక్ట్రిక్‌ కారును కొనుగోలు చేసింది.

Upasana Konidela: కొత్త ఎలక్ట్రిక్‌ కారు కొన్న మెగా కోడలు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు
Upasana Konidela

Updated on: Jul 31, 2022 | 7:21 AM

Upasana Konidela: మెగాపవర్‌ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan) సతీమణి గానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన కొణిదెల (Upasana Konidela). అపోలో లైఫ్‌కి వైస్ చైర్‌పర్సన్‌గా, బీ పాజిటివ్‌ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా సమర్థంగా విధులు నిర్వర్తిస్తోన్న ఈ మెగా కోడలు పలు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. యానిమల్‌ లవర్‌గా ఎన్నో వందల జంతువులను పరిరక్షిస్తోన్న ఆమె పర్యావరణానికి సంబంధించి పలు ఛారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.ఇలా పలు సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకున్న ఉపాసన కొత్త కారును కొంది. ఆడి కంపెనీకి చెందిన ఆడి ఇ-ట్రాన్‌ (Audi e-tron)ను ఎలక్ట్రిక్‌ కారును కొనుగోలు చేసింది. అనంతరం ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకుంటూ మురిసిపోయింది. ఈ కారు విలువ సుమారు రూ.1.66 కోట్ల పైచిలుకేనని సమాచారం.

తన కొత్త కారుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఉపాసన ‘ ఈ ప్రపంచంలో ప్రతీది అప్‌గ్రేడ్‌ అవుతోంది. అందుకనుగుణంగా నేను కూడా అప్‌డేట్‌ అయ్యాను. అందులో భాగంగానే ఆడి ఇట్రాన్‌ను కొన్నాను. నా అవసరాలకు తగ్గట్టుగా ఈ కారు ఎంతో అనువుగా ఉంది. ప్రయాణానికి సైతం చాలా సౌకర్యవంతంగా ఉంది. మరీ ముఖ్యంగా వాయిస్‌ కమాండింగ్‌ ఆప్షన్‌ మరింత బాగుంది’ అంటూ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..