డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), కన్నడ స్టార్ రాఖీభాయ్ యశ్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 2 (KGF 2) సినిమా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టి్స్తోంది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ. 700 కోట్లకు పైగా సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. యశ్ నటనపై.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేజీఎఫ్ 2 సినిమాపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాకింగ్ స్టార్ యశ్ నటనపై.. కేజీఎఫ్ 2 సినిమాపై తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చేశాడు. యశ్ నటన మైండ్ బ్లోయింగ్ అని.. కేజీఎఫ్ 2 సినిమా అద్భుతమంటూ చెప్పుకొచ్చాడు.
” కేజీఎఫ్ 2 సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు నా బ్రదర్ యశ్‌కు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు శుభాకాంక్షలు. యశ్ నటన మైండ్ బ్లోయింగ్..స్రీన్ మీద ఎంతో కమాండబుల్గా అనిపించాడు. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజు, రావు రమేష్ గారు కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ నటన అనిపించేలా ఉంది. శ్రీనిధి శెట్టి, మాళవిక అవినాష్, ఈశ్వరీ రావు, అర్చనా జోయిస్, రవి బస్రూర్ అందరూ నటన అద్భుతమనిపించారు. సాంకేతిక నిపుణులందరికీ కుదోస్ ” అంటూ రాసుకోచ్చారు చరణ్.
ప్రస్తుతం చరణ్ ఆచార్య సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నా సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈరోజు సాయంత్రం యూసఫ్ గూడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Jeevitha Rajasekhar: తప్పు చేస్తే ఒప్పుకునే ధైర్యం ఉంది.. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు..
Singer Sunitha: గుడ్ న్యూస్ షేర్ చేసిన సింగర్ సునీత.. Blessed అంటూ..
S Janaki Birthday: ఐదుతరాల హీరోయిన్లకు ఆలంబన జానకమ్మ స్వరం.. గానకోకిల పుట్టిన రోజు నేడు..
Viral Photo: ఇంద్రలోకంలో అలిగినట్లుంది.. భువిపైకి వచ్చింది ఈ సుకుమారి.. ఎవరో గుర్తించారా..?