Ram Charan: వైజాగ్‌లో సందడి చేయనున్న రామ్ చరణ్‌.. కొద్ది రోజుల పాటు అక్కడే మకాం.. కారణమిదే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులే అవుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్యలో జస్ట్ గెస్ట్ రోల్‌లో మాత్రమే సందడి చేశాడు చెర్రీ. ఆ తర్వాత వెండితెరపై రామ్ చరణ్ దర్శనమివ్వలేదు. దీంతో ఎప్పుడెప్పుడు అతనిని బిగ్ స్క్రీన్ పై చూద్దామా అని అభిమానులు ఆత్రుతుగా ఎదురుచూస్తున్నారు.

Ram Charan: వైజాగ్‌లో సందడి చేయనున్న రామ్ చరణ్‌.. కొద్ది రోజుల పాటు అక్కడే మకాం.. కారణమిదే
Ram Charan

Updated on: Mar 06, 2024 | 8:13 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులే అవుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్యలో జస్ట్ గెస్ట్ రోల్‌లో మాత్రమే సందడి చేశాడు చెర్రీ. ఆ తర్వాత వెండితెరపై రామ్ చరణ్ దర్శనమివ్వలేదు. దీంతో ఎప్పుడెప్పుడు అతనిని బిగ్ స్క్రీన్ పై చూద్దామా అని అభిమానులు ఆత్రుతుగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే తన సతీమణి ఉపాసనతో కలిసి అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకకు హాజరయ్యాడు రామ్ చరణ్. గుజరాత్ లోని జామ్ నగర్ వేదికగా జరిగిన అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్నాడు మెగా పవర్ స్టార్‌. ఇప్పుడు తిరిగి మళ్లీ కెమెరా ముందుకు రానున్నాడు. శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రం గేమ్ చేంజర్. ఇప్పుడీ సినిమా షూటింగ్‌ తదుపరి షెడ్యూల్‌ విశాఖపట్నంలో ప్రారంభం కానుంది. మార్చి 15 నుంచి స్టార్ట్ అయ్యే ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా జాయిన్ అవ్వనున్నాడు. ఇందుకోసమే వచ్చే వారం వైజాగ్ కు వెళ్లనున్నాడు రామ్ చరణ్. చెర్రీతో పాటు నవీన్ చంద్ర, శ్రీకాంత్, అంజలి, సునీల్, ఎస్ జే సూర్య తదితర నటీనటులు కూడా ఈ షెడ్యూల్ లో భాగం కానున్నారని తెలుస్తోంది.

 

ఇవి కూడా చదవండి

గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తోంది. వినయ విధేయ రామ సినిమా తర్వాత చరణ్, కియారా జంటగా నటిస్తోన్న రెండో సినిమా ఇది. భారీ బడ్జెట్‌తో దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను మార్చి 27న రిలీజ్ చేయనున్నారని సామాజిక మాధ్యమాల్లో టాక్ నడుస్తోంది. అయితే దీనిపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను డిసెంబర్ లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మరోవైపు ఈ సినిమాను లీకులు వెంటాడుతున్నాయి. ఇటీవలే ఓ సీన్ కు సంబంధించి వీడియో బయటకు వచ్చింది.

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.