AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika : సౌత్.. నార్త్ ఏంటి.? ఇండియన్ సినిమా అని పిలవాలి.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కొంతమంది అన్ని ఇండస్ట్రీలను కలిపి ఇండియన్ సినిమా అని భావిస్తే, కొందరువాటిని విడిగా చూస్తున్నారు. దీనిపై సినీ పరిశ్రమలోని పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీని కేగురించి నేషనల్ క్రష్ రష్మిక మందన్న మాట్లాడింది. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Rashmika : సౌత్.. నార్త్ ఏంటి.? ఇండియన్ సినిమా అని పిలవాలి.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rashmika
Rajeev Rayala
|

Updated on: Mar 06, 2024 | 8:06 AM

Share

ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియాల హవా నడుస్తుంది. కానీ ఇంకా కొంతమంది సౌత్ ఇండియన్ సినిమా, నార్త్ ఇండియన్ సినిమా అంటూ విడదీసి చూస్తుంటారు.ఈ చర్చ ఈ మధ్య మొదలైంది కాదు ఎప్పటి నుంచో దీని పై చర్చ జరుగుతూనే ఉంది. కొంతమంది అన్ని ఇండస్ట్రీలను కలిపి ఇండియన్ సినిమా అని భావిస్తే, కొందరువాటిని విడిగా చూస్తున్నారు. దీనిపై సినీ పరిశ్రమలోని పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీని కేగురించి నేషనల్ క్రష్ రష్మిక మందన్న మాట్లాడింది. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

రష్మిక మందన్నకు తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ వచ్చింది. కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన తర్వాత హిందీ చిత్ర పరిశ్రమ నుంచి ఆఫర్ అందుకుంది ఈ చిన్నది. అక్కడ కూడా నటించి  మెప్పించింది. తాజాగా ‘యానిమల్’ సినిమాతో భారీ విజయం అందుకుంది ఈ చిన్నది. తాజాగా రష్మిక  సౌత్ ఇండియా, హిందీ సినిమాలను విడదీసే వాళ్లకు గట్టి సమాధానం చెప్పింది. ‘మనమంతా ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో ఉన్నాము. మనమందరం ఒకే దేశానికి చెందినవాళ్లం.. కాబట్టి ఇండస్ట్రీని ఇండియన్ సినిమా అని పిలవడం ప్రారంభించే సమయం ఇది. మన దేశంలోని సినిమా పరిశ్రమలన్నీ ఒకేలా ఉన్నాయని అంగీకరించాలి’’ అని రష్మిక మందన్న చెప్పుకొచ్చింది.

‘ఒక సినిమా చేయడానికి వచ్చామంటే అక్కడ వేర్వేరు భాషలకు చెందిన వారు కలిసి పని చేస్తూ ఉంటారు. నాకు అలా అందరం కలిసి ఉండటం అంటేనే ఇష్టం. నేను రకరకాల భాషల్లో సినిమాలు చేస్తున్నా.. నేను ఇండియన్ సినిమాల్లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది’ అని రష్మిక మందన్న అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రష్మిక మందన్న ఇటీవల జపాన్ వెళ్లింది. అక్కడ జరిగిన అనిమే అవార్డు కార్యక్రమంలో జ్యూరీగా పాల్గొంది ఈ బ్యూటీ. ప్రస్తుతం   ‘పుష్ప 2’, ‘రెయిన్‌బో’ సహా పలు సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ.

రష్మిక మందన్న ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.