AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bedurulanka 2012 Trailer : రామ్ చరణ్ రిలీజ్ చేసిన ‘బెదురులంక 2012’ ట్రైలర్.. ఎలా ఉందంటే..

ఇక గతంలో విడుదలైన సాంగ్స్ యూట్యూబ్‏లో ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు. 2012 సమయంలో యుగాంతం రాబోతుందంటూ అప్పట్లో ఓ రూమర్ ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ రూమర్ ను బేస్ చేసుకుని కామెడీ నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథ మొత్తం బెదురులంక అనే గ్రామస్తుల చుట్టూ తిరుగుతుంది.

Bedurulanka 2012 Trailer : రామ్ చరణ్ రిలీజ్ చేసిన 'బెదురులంక 2012' ట్రైలర్.. ఎలా ఉందంటే..
Bedurulanka 2012
Rajitha Chanti
|

Updated on: Aug 16, 2023 | 8:37 PM

Share

టాలీవుడ్ యంగ్ హీరో కార్తీకేయ, డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం బెదురులంక 2012. ఈ సినిమాకు నూతన దర్శకుడు క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఇక గతంలో విడుదలైన సాంగ్స్ యూట్యూబ్‏లో ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు. 2012 సమయంలో యుగాంతం రాబోతుందంటూ అప్పట్లో ఓ రూమర్ ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ రూమర్ ను బేస్ చేసుకుని కామెడీ నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథ మొత్తం బెదురులంక అనే గ్రామస్తుల చుట్టూ తిరుగుతుంది.

తాజాగా విడుదలైన ట్రైలర్‏లో విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. అజయ్ ఘోష్, సత్య, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఈనెల 25న రిలీజ్ కాబోతుంది.

ఇవి కూడా చదవండి

రామ్ చరణ్ పోస్ట్.. 

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యారు కార్తికేయ. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత కార్తికేయకు సరైన హిట్టు పడలేదు. ఎప్పటికప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నఈ యంగ్ హీరో ఆశలన్నీ ఇప్పుడు బెదురులంక సినిమాపైనే ఉన్నాయి. ఇక మరోవైపు డీజే టిల్లు తర్వాత నేహ నటిస్తున్న ఈ సినిమా హిట్టయితే ఈ బ్యూటీకి మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.

కార్తికేయ ట్వీట్.. 

కార్తికేయ ఇన్ స్టా పోస్ట్.. 

View this post on Instagram

A post shared by Kartikeya (@actorkartikeya)

బెదురులంక 2012 ట్రైలర్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.