బాబాయ్‌ కోసం డేట్‌ మార్చుకున్న అబ్బాయ్‌.. చరణ్ పెద్ది రిలీజ్ డేట్ మారింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన సినిమాతో ఒక్కరిగా టాలీవుడ్ ను షేక్ చేశాడు బుచ్చిబాబు సన. ఆతర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు బుచ్చిబాబు.. ఇక ఇప్పుడు పెద్ది సినిమాతో రానున్నాడు. విలేజ్ బ్యాక్డ్రాప్ తో ఈ సినిమా కథను రెడీ చేశాడు. ఈ సినిమా లో చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నడు.

బాబాయ్‌ కోసం డేట్‌ మార్చుకున్న అబ్బాయ్‌.. చరణ్ పెద్ది రిలీజ్ డేట్ మారింది.
Peddi

Updated on: Feb 04, 2026 | 5:51 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. గేమ్ ఛేంజర్ సినిమాతర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చివరిగా చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాకు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఇప్పుడు బుచ్చి బాబు సన దర్శకత్వంలో పెద్ది సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఈ సినిమాలో చరణ్ ఊర మాస్ క్యారెక్టర్ గా కనిపించనున్నారు. ఈ సినిమా లో చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నడు. రామ్ చరణ్ ఒక ‘ఆట కూలీ’ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా నుంచి విడుదలైన చిక్కిరి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. యూట్యూబ్ లో ఈ సాంగ్ షాక్ చేస్తుంది. ఇప్పటికే వంద మిలియన్ కు పైగా వ్యూస్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

తాజాగా పెద్ది సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఏప్రిల్‌ 30న  పెద్ది సినిమా వరల్డ్ వైడ్‌‌‌గా గ్రాండ్‌గా విడుదలకానుంది. మార్చి 27న విడుదలకావాల్సింది. అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 26న రిలీజ్‌ కానుందని అనౌన్స్ చేశారు. దాంతో పెద్ది రిలీజ్ డేట్ వాయిదా పడింది. 30.04.2026 అంటూ పెద్ది హ్యాష్ ట్యాగ్‌ తో ట్వీట్‌ చేశారు దర్శకుడు బుచ్చి బాబు. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..