Peddi Movie: వెయ్యి మందికి పైగా డ్యాన్సర్లతో రామ్ చరణ్ స్టెప్పులు.. ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో పెద్ది ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబోలో వస్తున్న ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో చరణ్ ఫుల్ మాస్ రగ్గడ్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

Peddi Movie: వెయ్యి మందికి పైగా డ్యాన్సర్లతో రామ్ చరణ్ స్టెప్పులు.. ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
Peddi (6)

Updated on: Aug 27, 2025 | 8:26 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా వస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ తెగ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన రామ్ చరణ్ స్పెషల్ గ్లింప్స్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఇటీవల కొద్ది రోజులుగా నిలిచిపోయిన షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. వినాయక చవితి సందర్భంగా తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి : Tollywood: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. హీరోలతో ఎఫైర్ రూమర్స్.. 42 ఏళ్ల వయసులో దుమ్మురేపుతోన్న హీరోయిన్.. 

పెద్ది సినిమాలోని ఓ మాసివ్ సాంగ్ షూటింగ్ ను మైసూర్ లో ప్రారంభించినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రామ్ చరణ్ పై ఈ పాటను చిత్రీకరించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దాదాపు 1000 మందికి పైగా డ్యాన్సర్లతో ఈ పాటను షూట్ చేశారని.. విజువల్ ట్రీట్ అందించనున్నారని పేర్కొన్నారు. ఇందుకోంస ఆస్కర్ విన్నర్ ఏ.ఆర్ రెహమాన్ ఓ మాస్ నంబర్ ను కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : Cinema : ఓటీటీలో అదరగొడుతున్న కామెడీ థ్రిల్లర్.. 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..

ఇక ఎప్పటిలాగే రామ్ చరణ్ తన ట్రేడ్ మార్క్ గ్రేస్, ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో, స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించనున్నారని సమాచారం. రహమాన్ గారి డప్పు… రామ్ చరణ్ గారి స్టెప్పు.. నన్ను నమ్మండి.. ఇది మెగా పవర్ స్టార్ బ్లాస్ట్. డీఓపీ రత్నవేల్ విజువల్స్ మ్యాజిక్ చూడబోతున్నారు. సాంగ్ షూట్ ఈరోజే మొదలైంది అంటూ రాసుకొచ్చారు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ సందర్భంగా చరణ్ అండ్ టీమ్ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు చెబుతూ ఓ వీడియో పంచుకున్నారు. ఇక ఈ మాస్ సాంగ్ పెద్ది సినిమాలో హైలెట్ కానుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : Nayanthara : ఆ సినిమా చేయడం జీవితంలోనే చెత్త నిర్ణయం.. నయనతార సంచలన కామెంట్స్..

ఇవి కూడా చదవండి : OTT Movies: ఏం సినిమా గురూ ఇది.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూస్తే..